Feeds:
Posts
Comments

Archive for the ‘ఆత్మీయం పుస్తకం’ Category

ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా? సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని చూడండి.. ఏరి? అలా బిగుసుకుపోతారేం? ష్… జాగ్తత్తగా వినండి. కిశోర్ కుమార్ వద్ద ఏకలవ్య శిష్యరికం చేసినట్టు, గాలి ఈలలేస్తోంది. మీ పరధ్యానం మీదేనా? అవున్లే, మీ పరధ్యానం మీది కాకపోతే నాదవుతుందా? పదండి, మీరెటు పోతే, నేనూ అటే.. నిర్మానుష్యపు వీధిలో మానవాకరం. అటు తిరిగి నుంచున్నారెవరో? [...]

Read Full Post »

“నా పేరు పూర్ణిమ.” అన్న వాక్యం పూర్తి కాకుండనే, “నాతో చాలా కొంచెం బోలెడు జాగ్రత్త!” అని కూడా విన్నవించుకుంటాను. అయిననూ, ప్రాక్టీసు లేకుండా బౌన్సీ వికెట్ల మీద చేతులెత్తేసే టీంలు టాస్‍నూ, పిచ్‍లనూ ఆడిపోసుకున్నట్టు, నన్నూ అంటుంటారు. ఏదో సైటు మొదలెట్టామా? పెట్టాక, ఏదో కొత్త బులబాటం కాబట్టి ఆరంభశూరత్వం ప్రదర్శించామా? ఆ మాత్రం దానికే నా ఫ్రెండొకడు, “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అన్నాడు. సరే ఆ మాటను నేనెందుకు తప్పని [...]

Read Full Post »

( “అబ్బా మళ్ళీ ఇంకో పుస్తకమా? చదివేయటం.. రాసేయటం! ఇప్పుడు చదవాలా? ఎందుకు చదవటం.. ఎటూ పుస్తకాలు కొని చదివేంత లేదు! అదీకాక ఇలా పనులు కానీ పనులు పెట్టుకుంటే.. అసలైన పనుల పనేంగానూ?” అనుకుంటూ మీరీ టపా చదవకుండా వదిలేస్తే ఒక రకంగా మీరు అదృష్టవంతులు. కానీ ఈ పుస్తకం చదవకపోతే మీరెంతో కొంత మిస్సవుతారని రూఢీగా చెప్పగలను. ) నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. (మన ప్రమేయం పెద్దగా లేన్నట్టనిపిస్తుంది!) “అమ్మ పక్కనే కూర్చుని తలనిమురుతుందన్నట్టు” [...]

Read Full Post »

పోయిన వారాంతం విశాలాంధ్ర మీద దాదాపు దాడి లాంటిది చేసి మరీ కొన్న అనేకానేకమైన పుస్తకాల్లో, డా|| కేశవ రెడ్డి రచించిన “సిటీ బ్యూటిఫుల్” అత్యంత తక్కువ పేజీలు కలదీ, అంతే చవకా కూడా! అప్పుడెప్పుడో నవీన్ రాసిన “అంపశయ్య” పుస్తకం ఒక యాభై పేజీలు చదివి మళ్ళా ముట్టుకోలేదు. ఈ పుస్తకం “ముందు మాట”లో దాని ప్రస్తావన చూసి హడలిపోయాను. ఉన్నవే తొంభై పేజీలన్న ధైర్యంతో మొదలెట్టాను. కథ విషయానికి వస్తే దాదాపు అంపశయ్య కథే! [...]

Read Full Post »

“వీకెండ్ ఏం చేశావు?” అని అడుగుతుంటే ఒక పుస్తకం చదివాను అని చెప్పాలి అసలైతే, కానీ “క్లాసు లో ఉన్నా ఇంత సేపూ” అని అనాలి అనిపించేంతగా ఉంది ఈ పుస్తకం. మరి క్లాసు అటెండ్ అయితే నోట్స్ ఉంటుంది కదా? అదే ఈ టపా! ఒక్కప్పుడైతే మన నోట్స్ కి తెగ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది, అన్ని చోట్ల. ఇప్పుడు పూర్తిగా అలవాటు తప్పిపోయింది. క్లాస్: The Last Lecture book లెక్చరర్: Randy Pausch [...]

Read Full Post »

(గమనిక: ఈ టపా ముఖ్యోద్దేశ్యం, Gabriel García Márquez రచించిన Love in the Time of Cholera అనే పుస్తకం చదువుతున్నప్పుడు గానీ, చదవడం పూర్తయ్యాకా గానీ నాలో కలిగిన ఆలోచనలు ఇక్కడ పెట్టడం మాత్రమే. దీన్ని సమీక్ష అని నేననుకోవటం లేదు. పైగా ఇవి ఈ క్షణానివి. మున్ముందు ఇవి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఇది వరకే చదువున్న వారు, తమ అభిప్రాయాలని తెలిజేస్తే నా ఆలోచనా పరిధిని విస్తరించుకునే అవకాశం [...]

Read Full Post »

కల కాదుగా నిజమే కదా, నిను చూస్తున్నా సంతోషమై కెరటానిగా పడి లేస్తున్నా నిజ జీవితంలో కూడా నేపధ్య సంగీతం పాటలూ ఉంటే, ఇలాంటి పాటలన్నీ ఏరుకుని మరీ “ప్లే” చేసుకోవాల్సిన సందర్భం అది నా జీవితంలో! నేను ఇన్నాళ్ళు చూడని, ఎప్పటికి చూస్తానో తెలియని “సముద్రం” నా కళ్ళముందు నిలవడం, ఒక మరుపురాని అనుభూతి. మా తొలి ముఖ పరిచయానికి కోవళం వేదికగా మారింది. నేనొచ్చానని తెలిసి సముద్రం మరీ ఉత్సాహంగా ఉరకలు వేస్తుందోమో అన్న [...]

Read Full Post »

ఓ శనివారం మధ్యాహ్నం పూట కోఠికి వెళ్ళాను, ఒక స్నేహం కొన్ని తెలుగు పుస్తకాలు కావాలంటే తీసుకొద్దామని. కావాల్సినవి కొని బయటకి వస్తుండుంగా, ఇరుగ్గుగా ఉన్న ఆ కొట్టులో, ఓ వ్యక్తిని దాదాపుగా గుద్దబోయి ఎలానో సంభాళించుకున్నాను. “క్షమించండి” ని నవ్వుగా మార్చి మాట కలిపాను. కొత్త పరిచయాలన్న బెరకు ఎటూ తక్కువ కాబట్టి ఏవేవో మాట్లాడుకున్నాము చాలా సేపు!! మధ్యలో “అతని” ప్రస్తావన వచ్చింది. “ఆ తెలుసులే..అయినా నాకవన్నీ పెద్దగా ఎక్కవు” అన్నట్టు విన్నాను. ఆయన [...]

Read Full Post »

ఓసోస్.. ఆ కథా?? దాని గురించి మాకూ బోలెడు తెలుసు… స్వామీ అనే చిన్న కుర్రాడు.. మాల్గుడి అనే మనోహర పట్టణంలో తన తల్లిదండ్ర్రులతో ఉండేవాడు. ప్రాణప్రదంగా చూసుకునే ఒక బామ్మ కూడా.. నాన్న చలా స్ట్రిక్ట్.  అతగాడికి మణి, రాజన్ అనే స్నేహితులు ఉంటారు. వారితో అతని ఆటపాటలు, చిలిపి చేష్టలు, అమాయకపు భయాలు ఇవ్వనీ చదవని వారుండచ్చు.. చూడనివారుండొచ్చు. కానీ రెండూ చేయని వారి చాలా అరదు, అని అంటారా? సరే.. కాదనను.. కానీ [...]

Read Full Post »

న్యాయంగా ఈ టపాకి సీతారామారావు Vs డోరియన్ గ్రే అని శీర్షిక పెట్టి ఎప్పటిలానే నా సోది మొదలెడితే… ఎవరు చదువుతారో చదవరో గాని, నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్న బాబా గారు, నెటిజెన్ వారు చూడకపోతే ఈ టపా ఇక్కడ రాసి దండగ!! వీరెవరో బ్లాగ్లోకానికి నేను చెప్పనవసరం లేదు. అందుకే సీతారామా రావు, డోరియన్లను పరిచయం చేసుకుందాం. సీతా రామారావు.. త్రిపురనేని గోపిచంద్ రాసిన “అసమర్ధుని జీవయాత్ర” అనే తెలుగు నవలలో కథానాయకుడు. డోరియన్ గ్రే.. [...]

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.