(చిన్నపిల్లలెప్పుడూ తమకు అత్యంత ప్రీతిపాత్రులైన పెద్దవాళ్ళను అనుకరించాలని ప్రయత్నిస్తారు. రోజూ చూసే విషయాల్లో కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్దవాళ్ళు వేరుగా వ్యవహరిస్తుంటే కారణాలు తెలీకపోయినా పిల్లలూ అలానే చేస్తారు. ఉదాహరణకు, కాలికి దెబ్బ తగిలి కుంటుతూ నడుస్తుంటే, పిల్లవాడి కాలు సుబ్బరంగా ఉన్నా అలానే కుంటుతాడు. ఈ అనువాదం ద్వారా నేను చేసింది కూడా అలాంటి ప్రయత్నమే! ’కవితలు చెప్పి నెత్తురోడాను. కథలు రాసుకొని గాయాలకు కట్లు కట్టుకున్నాను’ అని గుల్జార్ అన్నారు. ఆయనకు కథే [...]
Archive for the ‘Published Elsewhere’ Category
భయం – గుల్జార్
Posted in Published Elsewhere, Translations, tagged Gulzar on March 22, 2012 | Leave a Comment »
ఓ కథ చచ్చిపోయింది!
Posted in Published Elsewhere, tagged External publishing on August 1, 2010 | 1 Comment »
First published in poddu.net ఓ కథ చచ్చిపోయింది. ఇదో, ఇప్పుడే, ఇక్కడే, నా సమక్షంలోనే! అంతా నా చేతుల్లోనే ఉందనిపిస్తూ, ఏదో ఒకటి చెయ్యాలని నేననుకుంటూ ఉండగానే చేయిదాటిపోయింది. చచ్చిపోయింది. వేళ్లకి అంటుకున్న ఇంకు మరకల తడింకా ఆరనేలేదు, మృత్యువు వచ్చి వెళ్లిన వాసనలు మాత్రం గుప్పుమంటున్నాయి. టేబుల్ లాంప్ వెలుతురులో పాలిపోయినట్టు పడున్న తెల్లకాగితాలని సమాధి చేయ్యందే ఆ వాసనలు తగ్గవు. కళ్లు మూసుకునే పనికానివ్వాలనుకున్నాను కాని, కడసారి చూపుల్ని కాదనుకోకని అంతరాత్మ పరిఘోషించింది. [...]
