ఊహలన్నీ ఊసులై..

చెప్పని కథల కథ
అతడెవరో ఎమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, అతడు కథలు బాగా చెప్తాడు(ట) అని.

నాకు కథలంటే ఇష్టం. కథలు చెప్పటమూ రాదు, నాకు. వినటమూ రాదు. అయినా ఇష్టం.

“నా వద్ద ఎన్ని కథలున్నాయో తెల్సునా?” అంటూ భుజానున్న కథల మూటను చూపిస్తూ ఊరించసాగాడు.

“ఏదీ? నాకూ చెప్పవూ?!” అని నేనూ ఆత్రం చూపాను.

“ఊహు.. ఇప్పుడు కాదు, మరెప్పుడైనా!” అని దాటవేసేవాడు.

“ఊ.. అలాగే” అంటూ తలూపేదాన్ని.

నాకు తెలీకుండానే అతడు మూట విప్పే రోజు కోసం ఎదురుచూసాను.

రానేలేదా రోజు. అలగడాలు, నిలదీయడాలు చేతనైనవాళ్ళ ఆయుధాలు. నేను అడగలేదు. అతడు చెప్పలేదు.

రోజులు గడిచాయి. నేను అడగను. అతడు చెప్పడు.

ఇప్పుడు, నేను అడగా లేను. అతడు చెప్పాలేడు. మా కథ కంచికెళ్ళిపోయిందిగా మరి!

అతడిప్పుడు వేరే ఏదో కథలో ఉన్నాడు, నేనుండని కథలో. ఇంకా కథలు చెప్తున్నాడో లేడో! తెలీదు.

నాది వేరే కథ; నేనే కథలు చెప్పాల్సిన కథలోకి వచ్చి పడ్డాను.

“కథలు వినడానికే నాకు అర్హత లేదనేమో అతడెన్నడూ కథ చెప్పలేదు. నన్నెలా పెట్టుకుంటావోయ్, కథలు చెప్పడానికి?” అని ఈ కథను నడిపిస్తున్నవాడితో వాదులాడలేను. వాడు ఉలకడూ, పలకడూ.

ఏం చేయగలనిక? కథలు చెప్పటం మొదలెట్టాను! అతగాడిలా అపాత్రదానల గురించి సంకోచించకుండా, ’ఓ కథ చెప్పవూ?’ అని అడిగినవారందరికి కథలు చెప్పేస్తున్నాను.

“అబ్బ.. ఎంత బావుందో కథ! ఎవరు చెప్పారు నీకివ్వన్నీ?” అని అడుగుతుంటారు.

’ఇంకెవ్వరూ? అతడే!’ అని అనుకుంటూ పైకనేస్తాను.
“ఎవరు చెప్పు? ఎవరు?”

అతడు మూట విప్పలేదు. అందులో ఏమున్నాయో నాకు తెలీదు. అసలున్నాయో లేవో అన్న అనుమానమూ రాకపోలేదు. అతడు కథలు చెప్పుంటే, ఇందులో, వాటినే తిరిగి అప్పజెప్పేదాన్ని. చెప్పకపోవటం వల్ల, నా ప్రతి క్షణపు ఎదురుచూపులో ఓ కొత్త కథ అల్లుకుంది. చిత్రంగా, ఇదో ఈ క్షణంలో కూడా అల్లుకుంటోంది..

“చెప్పూ..”

“అతడెవరో ఏమిటో నాకు తెలీదు. ఒక్కటే తెల్సుకున్నాను, కథలు బాగా చెప్తాడు(ట) అని —- “

ఒక రోజు
ఆమెతో నాకు పరిచయం ఉంది. సంబంధమూ ఉంది.

ఏర్‍పోర్ట్ లో కలిసాం. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయేవాణ్ణి ఆ పూటెందుకో దిక్కులు చూస్తూ ఉన్నాను. ఆమె తళుక్కుమంది. ’బాగుందే’ అననుకునే లోపే ’నా తెల్సు.’ అన్న స్పృహ.

ఆమె కూడా నన్ను చూసింది. ’ఎన్నాళ్ళకూ!’ అంటూ నా వంక తేరిపార చూసింది. ఇద్దరి ఫ్లైట్లూ ఓ ఎనిమిది గంటల పాటు డిలే అవడంతో ఊర్లోకి వెళ్దాం అనుకున్నాం. నా ముందు వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆమెను చూసి ’కొంచెం లావయ్యావే!’ అని నోరు జారాను. ఆమె అంగీకారార్థంగా విసిరిన నవ్వుకు చునువు ముదిరి ఇంకేదో కూసాను, నోటి దురుసుకు చేయి సాయం కూడా వెళ్ళింది, వలపాగ్నిలో విరహం పోసినట్టు. పెదాలపై నవ్వును కళ్ళలోకి పంపి మూతి బిగబెట్టి నా చేయి గిల్లింది, పొడుగాటి గోళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోయేంతగా.

టాక్సీలో వెనుక కూర్చున్నాం. నా భుజంపై తలవాల్చి పడుకుంది. భుజంపైనా, స్లీవ్స్ పైనా అవసరానికి మించున్న బటన్స్ చెంపకు వత్తుకుపోతున్నాయని , మరి కాస్త కిందకు తలపెట్టుకొని పడుకోడంతో జాకెట్ జిప్‍లోకి జుట్టు ఇరుక్కుంది. రుసరుసలాడుతూ విసురుగా తలలేపబోయేసరికి జుట్టు మరింతగా ముడిపడిపోయింది. ఏదో తంటాపడి జట్టు విడిపించి జాకెట్ తీసేయబోతుంటే నన్ను వారిస్తూ ఒళ్ళో పడుకుంది. నిద్రలోకి జారుకుంటుండగా నేను వంగి చెవిలోకి ఊదుతూ అల్లరిపెడుతుంటే నా జేబులో పెన్ లాక్కొని నా జీన్స్ పై వత్త్తిపెట్టి ’బాడ్ బాయ్’ అని రాసింది.

ఆకలేస్తుంటే రెస్టారెంట్‍కు వెళ్ళాం. అక్కడి వాళ్ళకి మా భాష రాదు. అందుకని నాకొచ్చిన భాషలో వాళ్ళని నానా మాటలూ అనడం, అది తెలీక వాళ్ళు మర్యాదపూర్వక నవ్వులు నటించటం. నాలోని హాస్యగాడు చెలరేగిపోతుంటే ఆమె నవ్వాపుకోలేక, అలా అని అంత మంది ఉన్న చోటున నవ్వలేక కరుణించమని బతిమిలాడుకుంది. నేను మాట వింటేగా! అసలే ఆమెకు చేతికి అందేంత దూరంలో లేను. కొట్టాలంటే లేవాలి అని అనుకున్నాను. ఆమె  వెనక్కి వాలి, కొంచెంగా సాగి ఆమె కాలితో నా కాలుకేసి కొట్టుంది. హీల్స్ తగిలాయి కాలి ఎముకకు, నొప్పి జివ్వుమనేంతగా.

ఆరగించింది అరిగించడానికి నడక మొదలెట్టాం. కాసేపు గబగబా. కాసేపు నెమ్మదిగా. కాసేపు దూరదూరంగా. కాసేపు అల్లుకుపోతూ. కాసేపు ముందూవెనుకా. కాసేపు ఒకేసారి అడుగులేస్తూ. కాసేపు ఆటపట్టిస్తూ. కాసేపు బతిమిలాడుతూ. ఒక విండో డిస్ప్లే లో ఉన్న డ్రస్ చూడ్డానికి క్షణం ఆగింది. క్షణకాలపు చూపులో ఇష్టాన్ని అంతగా వ్యక్తం చేయటం ఎలా సాధ్యపడుతుందో? ’కొందాం..పద’ అన్నాను. వద్దని వారించింది. వాదులాడుకున్నాం. ’ఏం? కొనలేనివి ఏవీ ఇవ్వలేవనా ఇది కొనడం?’ అని అడిగింది. ఒక్క మాటతో నోర్మూయించడం కూడా ఎలా సాధ్యపడుతుందో?

గంటన్నర ప్రయాణం చేస్తే ఒక రొమాంటిక్ పిక్నిక్ స్పాట్ ఉందంటే అక్కడికే బయలుదేరాం. నదీ తీరం. లోతు లేదసలు. అరనిక్కరు పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటున్నారు. అయినా దిగనంది. నేను ఉంటానుగా అని ఎంత చెప్పినా దిగనంది. నేను దిగి దోసిట్లో తీసుకున్న నీళ్లను ఆమెపై జిమ్మాను. ఒకట్రెండు సార్లు చేయగానే మొహం దాచేసుకుంది. ఎంత అడిగినా తలే ఎత్తదు. దోసిట్లోకి నీళ్ళు తీసుకోనూ, ఆమెను బతిమిలాడుకోనూ, నీళ్ళన్నీ జారిపోనూ. ’నువ్వూ దోసిట్లో నీళ్లలానే. ఎంత పట్టుకోవాలన్నా జారిపోతావు.’ అనేసాను ఏదో ఆలోచిస్తూ. కోపం వచ్చేసింది. సర్రున లేచింది. నా చేయి పట్టుకొని నీళ్ళలోకి దించి, ఓ పక్క పాకుడురాళ్ళపై అడుగును ఆన్చడానికి భయపడి నా మీదే బరువునంతా ఆన్చి, నన్ను నీళ్ళల్లో పడేసింది మెల్లిగా. పడ్డవాడిని లేవబోతుండగా నా భుజాలు పట్టుకొని మొత్తంగా వెనక్కి వాల్చింది. నేను అర్థంకాక ఏదో మాట్లాడబోతే నా నోరు నొక్కేసి నన్నలానే పట్టుకునుంది. అడుగు లోతున్న నీటి ప్రవాహం నా వంటి మీద నుంచి ప్రవహిస్తుంటే, నా ప్రత్యణవునూ స్వచ్చమైన శీతల నీరు తాకుతుంటే, అనిర్వచనీయమైన అద్వితీయానుభవంలో నేను పులకరించిపోతుంటే నన్ను కళ్ళార్పకుండా చూస్తూ ఆమె నా పక్కనే.

తడిపొడీ బట్టలు దులుపుకుంటున్న ఆమెను చూస్తుంటే తడిసి ముద్దైన నాలో వేడి ఎగజిమ్మింది. ఆమెను దగ్గరకు లాక్కొని కన్నార్పకుండా చూస్తుండగా సూర్యుడు సన్నగా నవ్వి మెల్లిగా జారుకున్నాడు, వెలుగుతున్న లాంతరులో వత్తిని తగ్గించినట్టు. వెలుగు కానీ చీకటీ కానీ వెలుతురులో ఆమె బుగ్గను ఆస్వాదిస్తుండగా నాలుకకు తగిలిన రక్తపు రుచి రసాభంగం కలిగించింది. గాయం చేసిన నోటితోనే సాంత్వనా కలిగిస్తున్నప్పుడు ఈసారి నా పెదవంచును తాకిన నీటి చుక్కలను నాలుకతో లోపలికి తీసుకోగానే, అబ్బా.. ఉప్పదనం.

ఇహ, ఫ్లైట్‍కి టైం అయిపోతుండడంతో తిరుగుప్రయాణానికి హడావుడి పడిపోయింది. నేనేమో ఆ వీధి దగ్గర ఆపించాను, డ్రస్ కొందామని. ’సామాన్యమైనవాటి మీద నీ కళ్ళు పడవే’ అని బిల్ కడుతూ గొణుకున్నా. ’అందుకే నీ మీద పడ్డాయి.’ అనేందుకు ఆమె పక్కనే లేదు. ప్చ్..

“ఎంత బాగా గడిచిందిగా రోజు. నమ్మకం కుదరటం లేదు.” అన్నాను.

“నాకెవరో చెప్పారులే, నిజంపై అంత త్వరగా నమ్మకం కుదరదని.”

“నేనేనా వాగింది? అది కాదు. నీకనిపించటం లేదా? ఇదంతా టూ గుడ్ టు బిలీవ్ లా ఉందని..”

“ఏమో..”

“ఏమో కాదు మొద్దూ, ఆలోచించు. ఇదంతా కల కావచ్చు.”

“నీదా? నాదా?”

“గుడ్ క్వశ్చన్. నీదీ అవ్వచ్చు. కానీ కాదనుకుంట. నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తావంటే ఊహు.. నేను నమ్మను. నాదే అనుకుంట. ఒక్కసారి గమనించు. నువ్వచ్చు నాకు నచ్చినట్టే ఉన్నావ్ ఇవాళ. ఒక సెకను కూడా నాకు దూరం కాలేదు. పూర్తిగా నాతో ఉన్నావు. నా ధ్యాసను ఇంకెటూ మరలనివ్వలేదు… ఇదంతా కలే అనుకుంట..”

“ఏమో బాబూ.. ఇప్పుడు ఏదయితే ఏంటి?”

“అలా అడుగుతావేం? కలకీ ఇలకీ తేడా లేదూ? ఇదే ఒకవేళ నిజంగా జరుగుంటే? జరక్కపోయుంటే?”

“మరేం నష్టం లేదు. అనుభవంలోకి వచ్చేసాక ఏదైతే ఏంటి?”

ఏర్‍పోర్ట్ లో ఫ్లైట్ అనౌన్స్-మెంట్.

“హే డ్రస్ పెట్టుకున్నావా?” అని అడగబోయి ఆగిపోయాను. డ్రస్ లేదు. టాక్సీలో మర్చిపోయామా? వాణ్ణి ఎలా పట్టుకోవటం? అసలెక్కడి నుండి తీసుకున్నాం టాక్సీని? వెళ్ళిన ప్రదేశాలేంటి? వాటి పేర్లేంటి? రెస్టారెంట్ వాళ్ళు మాట్లాడిన భాషేంటి? డ్రస్ కొన్న వీధి పేరు? ఆ నది పేరు? ఈ ఏర్‍పోర్ట్ పేరు? ఈ ఊరి పేరు? ఈ దేశం పేరు?

అర్రె! నా బట్టలింత పొడిగా ఎలా అయ్యాయి? నదంతా నాలో ఇంకిపోయిందా? డ్రస్ కొన్నానుగా, మరి అకౌంట్‍లో డబ్బులు తగ్గలేదు? రోజంతా అయిన ఖర్చో? నా జాకెట్‍లో ఇరుక్కున్న నీ వెంట్రుకలు? నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు? నీ బుగ్గ మీద నేను చేసిన గాటేది?

“నీతో ఎప్పుడొచ్చినా ఇదే గోల. నీతో గడిపిన క్షణాలకు సాక్ష్యాలుగా వేటినీ మిగల్చవేం?”

“ఏం రుజువుంటే గానీ నేను లేనా?”

“వాదించకు. వేధించకు. దెయ్యంలా అన్నీ మింగేస్తావేం? ఎందుకిలా చిత్రహింసలు పెడతావ్.. నిజమో, అబద్ధమో తేల్చుకోలేక పిచ్చెక్కిపోతోంది.”

“ఎందుకంత గొడవ పడతావ్? నేను నిజాన్ని. నీ నిజాన్ని. నీకు మాత్రమే నిజాన్ని.”

“అంటే కలవి. మాయవి. నా భ్రమవి. అంతేనా?”

“కలయో. వైష్ణవ మాయో!”

“దుర్మార్గురాలా! ఒక్క జ్ఞాపకాన్నీ మిగిలనివ్వవా? ఎందుకిలా కలవై వెంటపడి వేధిస్తావ్.”

“నువ్వూ నాకు కలేగా.. అందుకు.”

ఇంకిపోయిందనుకున్న నది ఇప్పుడు పొంగుకొచ్చింది. “దొరికిందా సాక్ష్యం” అంటూ నుదుటిన ముద్దు పెట్టి తన దారిన తాను పోయింది. పెదాల స్పర్శ లేదు. తన్మయత్వం మాత్రం కలిగింది.

అలా ఆమెతో నాకు పరిచయమూ ఉంది. సంబంధమూ ఉంది.

హృదయపు రక్తస్రావం..
ఇవ్వాళెందుకో రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉండాలనిపిస్తోంది.

కథలో, కవితలో కాదు. అచ్చంగా నా ఆలోచనలే. ఏ ముసుగు లేకుండా! అందుగ్గానూ నీ ఇన్‍బాక్స్ ఎన్నుకున్నాను. ఒక కాల్‍తో పోయేదానికి ఎందుకిలా కాల్చుకొని తినడమంటే.. దోరగా వేయించిన చివాట్లు పెడతావనీ..

ఎంతగా ధ్యాస మారుస్తున్నా ఒకటే ఇమేజ్ కళ్ళ ముందు కదలాడుతోంది. చేతికి లోతైన గాటు పడినట్టు. నెత్తురోడుతున్నట్టు. సూదిని చర్మంలోకి దించి పైకి లాగుతున్నప్పుడు దారపు పోగులపై రక్తం పాకుతున్నట్టు.. ఊహించుకో! తెల్లటి దారం పై మెల్లమెల్లగా పాకుతున్న ఎర్ర్రటి నెత్తురు. జూమ్‍లో ఊహించుకో! బాగుందా? హమ్మ్.. ఎందుకో అదే పదేపదే వెంటాడుతోంది.

అలా చూడకు, ప్లీజ్. ’మీ రచయితలంతా ఇంతే! దారపు పోగును భూతద్దంలో చూపించి కొండచిలువని నమ్మిస్తారు” అంటూ మొదలెట్టకు! రాయలేనివాళ్ళు అదృష్టవంతులు ఎలాగైనా! మీ కన్నీళ్ళన్నీ ఇంకిపోతాయి అనంతంలోకి.

మావి అలా కాదుగా! మాటల ఇటుకులు పేర్చి బావి కట్టుకుంటాం. వాటిని కన్నీటితో నింపుకుంటాం. చేద వేసి తోడి, మళ్ళీ బావిలోనే పోస్తాం. అది మా దురదృష్టం.

అయినా నిజం చెప్పు. రాయడమనేది అంత పెద్ద నేరమా? ’ఎందుకలా బుర్ర పాడుచేసుకోవడం?’ అని ఎంత తేలిగ్గా అడిగేస్తారేం? ఏం? మీరు పాడుచేసుకోరూ?

ఆలోచనే! అస్థిత్వం లేని ఆలోచన. అయినా అది బుర్రలోకి జొరబడి అక్కడే ఆగిపోతుందా, మీకైనా, మాకైనా? నలిమి మింగేసేంతగా పరిణామం చెందదూ? బుర్ర వేడెక్కడమే కాదు, నరాల్లో వేదన మొదలవ్వదూ? ఛాతీలో మంట పుట్టదూ? ఉండలుండలుగా కడుపులో ఏవో పల్టీలు కొట్టవూ? కాళ్ళు తేలిపోవూ? అరికాళ్ళ మీద ఏదైనా బరువుంటే బాగుణ్ణని అనిపించదూ?

God damn it! It just doesn’t remain at a psychological level. It hurts you physically. Whatever that “it” may be.

కాదంటావా? మానసిక బాధ శరీరాన్ని ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో.. ఒప్పుకోరేం?! హైద్రాబాద్‍లో పీర్ల పండుగనాడు, ఛాతీ పై గాట్లు పెట్టుకుంటారు. ఆలోచనలు ఛాతీ లోపల ఎంచుమించుగా అదే పనిజేస్తాయి. కాదనమను ఎవ్వరినైనా?

సరే.. ఇంతకీ అసలు విషయం. చూసావా? ఫోన్ చేసుంటే నేరుగా టాపిక్ చెప్పాల్సి వచ్చేది. ఇక్కడ కాబట్టి నా ఇష్టారాజ్యం.

మొన్న నీతో మాట్లాడాక, ధైర్యం చేసి అక్కిని మాటల్లోకి దించాను. అలా దించడానికి చాలా రిహార్సల్స్ వేసుకుంటే గానీ ధైర్యం చాల్లేదు. నవ్వొచ్చింది. కొంచెం ఏడుపు కూడ. నిన్నా మొన్నటి దాకా, బాత్రూంకి వెళ్ళడానికి కూడా నాతో చెప్పేవాడు. అమాంతంగా పెద్దవాడైపోయాడు. ఇప్పుడు వాడికో ’స్పేస్’. అందులో నాకూ అనుమతి లేదు. రాదు. వాడి వ్యక్తిత్వం ఎన్నో పొరలను సంతరించుకుంటోంది ఇప్పుడు. వాటిలో చాలా వాటి ఉనికి నాకు తెలీను కూడా తెలీదు.

మళ్ళీ.. ఇంతకీ అసలు విషయం…

“యెస్ మామ్! ఒకరిని ఇష్టపడుతున్నాను..” అని ఒక క్షణం ఆగాడు. నేను వాడికేసి చూస్తూనే ఉన్నా. “డోంట్ ఫ్రీక్. ఇట్స్ ఎ గాళ్!” అన్నాడు ఒక కన్ను కొడుతూ, నవ్వుతూ. పదిహేడేళ్ళ రిషిని కళ్ళముందుకు తెచ్చినట్టూ.

నాకో క్షణం పట్టింది అర్థమవ్వడానికి. ఓహో! వీడు ఇంకొకడిని వేసుకొని తిరిగే అవకాశం కూడా ఏడ్చిందిగా! అందుకని అన్నాడు మాట, “డోంట్ ఫ్రీక్” అని.

చిత్రం కదూ! మనప్పుడు మనం అబ్బాయిలతో సఖ్యంగా ఉండడానికి ఎన్నో ఆంక్షలు. ఇప్పుడా ఆడా-మగా పట్టింపు లేదు. ఎవరితో పడ్డామన్నది వేరే కథ. పళ్ళు మాత్రం రాలుతాయి.

అబ్బా ప్రేమలో పడ్డాలు. ఎన్నేసి రకాలు? నలభై అంతస్థుల మీద నుండి పడుతున్నట్టు. అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డట్టు. కాలు బెణికి పడ్డట్టు. జారుడుబండ మీద జర్రున జారుతూ పడ్డట్టు. తలతిక్క ఎక్కువై జారుడు బండ మీద నడవడానికి ప్రయత్నించి పడ్డట్టు. ఆదమరచి నుంచున్నప్పుడు ఎవరో బలంగా గెంటేస్తే పడ్డట్టు. కలలో విహరిస్తూ, మంచం చాలక కింద పడ్డట్టు. మణికట్టుని బలంగా పట్టుకొని ఎవరో లాగుతుంటే పడ్డట్టు. దులుపుకొని లేచే లోపు మళ్ళీ పడ్డట్టు. అగాధం అని తెల్సి, తెల్సి పడ్డట్టు. నవ్వినట్టు. ఏడ్చినట్టు. బతికినట్టు. చచ్చినట్టు. ప్రేమించినట్టు.

ప్రేమ తప్పి, గుండె చొట్ట పడినట్టు.

అయినా వీడు ప్రేమలో పడుతుంటే, నేనెందుకు ఇంత నెర్వస్ అవుతున్నాను? నాకర్థం కాదు. ప్రేమ వాడికి ఏ నరకాలు చూపిస్తుందోనని భయం. లేదా స్వర్గపుటంచుల దాకా తీసుకొని పోయి, తోసేస్తుందనేమో! భయం. బెంగ. ఆందోళన. నువ్వన్నట్టు వాడికో జీవితం ఉంది. తల్లకిందులైనా వాడి జీవితం వాడే బతకాలి. కన్నతల్లిగా వాణ్ణి అన్ని కష్టాలనుండీ కాపాడేయాలన్న తాపత్రయం ఉన్నా.. వాడి జీవితానికి నేనూ ఒక ప్రేక్షకురాలినే! కాకపోతే అమ్మను కదా! అందుకని ముందు లైన్లో కూర్చుని దగ్గరగా చూస్తానన్నమాట. అంతేనా?

అందరి తల్లులకూ ఇలానే అనిపిస్తుందా? లేక, నీ భాషలో చెప్పాలంటే నాకు మాత్రమే సాధ్యపడే మాయరోగం వల్ల అంటావా?

నువ్వు కాబట్టి ఇదంతా చదువుతున్నావ్.. కాసేపు ఆవేశంతో ఊగిపోయి, ఈ వెర్రి మొర్రి ఆలోచనలకు నా తలంటి, ఆనక శాంతిస్తావ్. అదే రిషి అయితేనా.. అసలింతదాకా వచ్చేదే కాదు. ఈపాటికి ఎప్పుడో దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకొని.. ఆహా! ఒక చెవిలో అతని గుండె చప్పుడు. రెండో చెవిపై అతడి అరచేయి. ఆ చేతిలో ఏదో మహత్యం. ఒక్కసారి తలనిమరగానే ఆలోచలన్నీ హుష్ కాకి.. అందుకే అప్పట్లో నా రాతలన్నీ చప్పగా ఉండేవి.

నీకు గుర్తుందా సుమా? నీకు కొత్తగా పెళ్ళయ్యిందనీ, నువ్వు మీ అత్తారింట కాపురం మొదలెట్టావనీ, మీ ఇంటికి చుట్టాల తాకిడి ఎక్కువనీ.. అన్నీ తెల్సి కూడా భోరున ఏడ్చుకుంటూ నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసాను? నాకోసం, పాపం మీ ఆయన, హాల్‍లో పడుకున్నాడు ఆ రెండ్రోజులూ. మీ అత్తగారొచ్చి ఆరా తీస్తే, “చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచిన మామయ్య పోయాడని.. తట్టుకోలేకపోతుందనీ..” అంటూ ఏదో చెప్పావ్. ఆవిడ నన్ను ఎంత బా చూసుకున్నారు! ఆ తర్వాత ఎప్పుడు నా మాటొచ్చినా, “పిచ్చి పిల్ల! ఎంత ఏడుపేడ్చిందో.. ” అని అనకుండా ఉండేవారు కారు.

నాకు అటూ, ఇటూ ఎటూ మావయ్యల్లేరని ఆవిడకు తెలీకుండానే పోయారు. ప్చ్..

రిషి కోసం ఎప్పుడేడ్చినా అంతే! కొంపలంటుకుపోయినట్టు. ఇహ, అక్కడితో అంతా అయ్యిపోయినట్టు.

రిషి..రిషి..రిషి.. అదో తపస్సులా. ఒక ధ్యానంలా.

రిషి, అక్కి ఇద్దరూ కల్సి నన్ను బాగా జడిపించేవాళ్ళు. ’ఎప్పుడో మీ వల్లే నా గుండె ఆగిపోతుంది.’ అని విసుక్కునేదాన్ని.

’వేషాలు వేయకు రిషీ! నా గుండెకు స్విఛాఫ్ బటన్ నీలో ఉంది.” అని ఎన్ని సార్లు చెప్పానో లెక్కలేదు.

నువ్వు అన్నట్టు నేను రొమాంటిసైస్ చేసానేమో! చదువర్లకు కిక్ రావాలని, నిజంగా లేనిపోనిది రాస్తామేమో. మనిషి చూడగలిగినంత పెద్ద కాన్వాస్‍పై ప్రేమను అందంగా చిత్రీకరిస్తామేమో! నీవన్నీ ఉత్త అభాండాలు కావు, నిజాలేమో!

లేదా, నా ప్రేమలోనే లోటుందో?

రిషిని వదిలి ఒక్క క్షణం ఉండలేని నేను, ఇన్నాళ్ళూ ఎలా ఉన్నాను? ఇంకా ఎలా ఉంటున్నాను? అప్పుడే నా గుండె ఎందుకు స్విఛాఫ్ అయ్యి.. పోలేదు? అయ్యుంటే అక్కీ ఏమయ్యిపోయేవాడు? వాడి కోసం బతకుతున్నా అన్నది నా పాశమా? బాధ్యతా? అవసరమా? వంక?

రిషి.. రిషి.. రిషి.. ఈ ధ్యానమింకా ఆగదేం?! ఇలా లేనిపోనివన్నీ ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటుంటే వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని నా తలనిమురుతాడు అన్న ఆశ చావదేం?

రాడని తెల్సీ ఎదురుచూస్తున్నాను. లేడని తెల్సీ ప్రేమిస్తున్నాను.

అవును మేం రచయితలం. సమాజం అమోదించిన మానసిక రోగులం. బదుల్లేని ప్రశ్నల కొరడాలతో ఒళ్ళు హూనం చేసుకునే పోతురాజులం. గాయాలు వేడుకలు మాకు. కన్నీటి ఉప్పదనమే ఉపశమనం మాకు.

నువ్వైనా ఎన్నాళ్ళు భరిస్తావో నేనూ చూస్తాను. ’సెండ్’ బటన్ కొడుతున్నా.. కాచుకో.

కావోలోయ్, స్నేహితుల ఇన్‍బాక్స్ ఇలాంటి పైత్యాలకు.

నీ,

విద్య

హవ్.. అన్నా!
రోడ్లపైన జనాలు బారులు తీరి ఉన్నారు.  భారతదేశ జనాభాలో వైవిధ్యానికి నమూన చూపడానికి సరిపడా ప్రజలున్నారు. అన్ని వయసుల వారు. అన్ని మతాల వారు. అన్ని వర్గాల వారు. “అన్నా హజారే జిందాబాద్..”, “వి వాంట్ క్లీనర్ ఇండియా!”, “అవినీతిని నిర్మూలిద్దాం.. అన్నాకు మద్దతునిద్దాం” అన్న నినాదాల మధ్య, “ఇన్నాళ్ళూ దేశాన్ని దోచుకొని తిన్నారు. ఒక్కసారి ఈ బిల్ రానీ, నా కొడుకులు బతుకులని రోడ్డు మీదకు లాక్కురాకపోతే చూడు..” అన్న ఆగ్రహం, “హైట్స్ యార్.. ఒక డబ్భై ఏళ్ళ మనిషి నిరహార దీక్షలు చేస్తుంటే, మీకు ఇంగ్లాండ్‍లో ఇండియా ఇన్నింగ్స్ గురించి బెంగగా ఉందా?” అన్న చిరాకు, “ఇదేదో బాగుందే! ఇలా రోడ్ల పైకొచ్చి అరవడం, మనమేదో సాధించేస్తున్నాం అన్నట్టు.. ఫీల్స్ గుడ్!” అన్న సంబరం, “అబ్బా.. గొంతెండుకుపోతోంది. కాసిన్ని మంచినీళ్ళు దొరికితే బాగుణ్ణు” అన్న అలసట కూడా ఆ నిరసన నడకలో పాలుపంచుకున్నాయి.

“రేయ్య్.. ఇదో ఈ ఆంగిల్ నుండి ఒక ఫోటో తీయ్య్.. ఇక్కడ అయితే జనం బా కవర్ అవుతున్నారు” అన్నాడు, ఒకడు ఇంకోడితో. “తీయగానే ఫేస్‍బుక్‍లో లోడ్ చేసేయ్య్.. అది చూసి, చాలా మంది రావాలి. వస్తారు కూడా! లైవ్ అప్‍డేట్స్ కావాలి..” అన్నాడు ఇంకా ఆవేశంగా.

ఇంకోడు ఫోన్ తీసాడు, ఫొటో తీయడానికి. పదిహేను మిస్‍డ్ కాల్స్ అన్న కబురు చూపించింది. “అబ్బా.. ఆమ్మే అయ్యుంటుంది.” అని సన్నగా విసుక్కుంటూ తెరిచాడు. అక్క నుండి కాల్స్. మెసేజస్ కూడా. “రేయ్య్.. ఎక్కడున్నావ్? ఇంటికెళ్ళు త్వరగా!”, “ఫోన్ లిఫ్ట్ చేయ్.. “, “అమ్మకు బాలేదు. హాస్పిటల్‍కు తీసుకెళ్ళాలి.”, “నువ్వు ఈ మెసేజెస్ చూడగానే వెంటనే డాక్టర్ అంకుల్ క్లినిక్ వెళ్ళు.. అమ్మ అక్కడే ఉంది.” అన్న మెసేజ్‍లు చదవడానికి క్షణాలు సరిపోయాయి. బుర్రలోకి ఎక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. ఉన్న చోట నుండి బైక్ పార్కింగ్ ప్లేస్‍లోకి ఎలా పరిగెట్టాడో, ఆ పార్కింగ్ పద్మవ్యూహం నుండి ఎలా బయటపడ్డాడో, క్లినిక్ ఎలా చేరుకున్నాడో అతడికి తెలీదు.

క్లినిక్‍లో వాళ్ళ అమ్మను మంచం మీద చూసాడు. “నీకేమయ్యింది?” అంటూ కూలబడిపోయాడు. కొడుకుని దగ్గర తీసుకోవటంలో నిమగ్నమైన ఆవిడ సమాధానం ఇవ్వలేదు. “ఏమయ్యింది?” అని రెట్టించాడు. ఆవిడకు కళ్ళల్లో నీళ్ళుతిరుగుతున్నాయి, వాణ్ణింకా దగ్గరకు తీసుకొని, తల నిమిరారు.

“హే వచ్చావా? నీ కోసమే చూస్తున్నాం.” అంది ఆ అమ్మాయి.

“మీ అమ్మ మెట్లు దిగుతుంటే.. కళ్ళు తిరిగి.. బి.పి అట కదా.. పెద్ద దెబ్బలేం తగల్లేదు. కాలు బెణికింది. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. లక్కీగా ఆవిడ పడినప్పుడు మీ అక్కతో ఫోన్‍లో మాట్లాడుతున్నారు. ఆవిడ వెంటనే నాకు కాల్ చేసారు. అంటే.. మొన్నటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నెంబర్స్ ఇచ్చుకున్నాం, నాకు ఆవిడతో కాలేజీ పనేదో ఉంది, అందుకని.” – సమాచారం మొత్తంగా చెప్పేసి, అప్పటికే ఆలస్యమయ్యిందనీ, వెళ్ళొస్తాననీ చెప్పి వెళ్ళిపోయింది.

డాక్టర్‍తో మాట్లాడి, మందులు కొనుక్కొని, అమ్మను తీసుకొని ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరాడు. ఇల్లున్న సందు మలుపులోనే ఆపేసి, ఆటోవాడు దిగమన్నాడు.

ఒక పదడుగులు లోపలికి వెళ్ళమన్నాడు ఇతడు. పదడుగులేగా వేసుకొమ్మన్నాడు వాడు. దెబ్బ తగిలున్న మనిషన్నది కనిపించటం లేదా అని అడిగాడు. కనిపిస్తుంది; యాభై ఎక్ట్రా ఇస్తే వస్తానన్నాడు. అడుగుక్కి ఐదు రూపాయలా? అని మండిపడ్డాడు ఇతడు. ఏం? గుక్కెడు మంచినీళ్ళకి రూపాయలు పెట్టగాలేనిది అని వాదనకు దిగాడు వాడు. ఆటోవాళ్ళల్లో మానవత్వం కరువైయిందని వాపోయాడు ఇతడు. ఇందాక పండ్ల మార్కెట్ కాడ రెండు నిముషాలు ఆపినందుకు పైసల్ అడగలేదని గుర్తుచేసాడు వాడు. ప్రజల్ని పీడించుకుని తినటంలో రాజకీయ నాయకులకన్నా దరిద్రం ఆటోవాళ్ళు అని ప్రకటించాడు ఇతడు. మాటలు సరిగ్గా రానివ్వమంటూనే, దినం దినం ట్రాఫిక్ పోలిస్ హౌలాగాళ్ళతో వేగితే తెలుస్తుందన్నాడు వాడు.

“ఒరేయ్.. నాన్న! గొడవెందుకు? నేను నడుస్తా పద. “

“లేదమ్మా.. కూర్చో! సరే.. పోనివ్వు, యాభై ఇస్తా..”

“మాంచి బేరం తగిలింది. పక్కనే అని చెప్పి శశ్మానంలోకి తీసుకొచ్చాడు.”

మనవాడికి కోపం పెరిగి, శరవేగంతో నోట్లోకి తన్నుకొచ్చిన బూతులు, వాళ్ళ అమ్మ అతడి చేయి నొక్కిపెట్టటంతో సడెన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాయి. ఇంటి ముందు ఆటో దిగాక, అప్పనంగా గుంజుకున్న యాభై రూపాయల వంక ఆప్యాయంగా చూసుకుంటూ, “అన్నా హజారే సాబ్?” అన్నాడు ఇతగాడి చొక్కా మీదున్న బొమ్మను చూసి.” లోక్‍పాల్ బిల్ రావాలా.. అప్పుడు మీటర్ వేసి నడుపుతా. పోలిసోలందరూ బొక్కలోకి పోయే రోజు రావాలా.. ఫుకట్‍లో తీసుకుపోతా సవారీలను, సవారీలను. పీక్క తింటున్నారు సాలేగాళ్ళు. అమ్మ జాగ్రత్త సాబ్!” అంటూ వెళ్ళిపోయాడు వాడు.

కాసేపటికి వాళ్ళక్క ఫోన్ చేసింది. అమ్మను గురించి వాకబు చేసింది. కంగారు పడాల్సింది ఏమీ లేదు కదా అని ఒకటికి రెండు సార్లు అడిగి నిర్దారించుకొంది. తనకు చాలా భయమేస్తుందని చెప్పింది. వెంటనే బయలుదేరి రావడానికి సిద్ధం అని చెప్పింది. అమ్మను జాగ్రత్తగా చూసుకోమంది. తమ్ముణ్ణీ జాగ్రత్తగా ఉండమంది. ఇంట్లో పనులన్నీ సద్దుమణిగాక, ఫోన్ చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి, ఫోన్ పెట్టేసింది.

ఇతగాడూ అమ్మకు జ్యూస్ చేసి, మందులు మింగించి, ఆవిడ పడుకున్నాక, టివి ముందు లాప్‍టాప్ తో తిష్టవేసాడు. అన్నా ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నారంతా! టివిల్లో ఊదరగొట్టేస్తున్నారు. ఫేస్‍బుక్ తెరిచాడు. వాల్ మొత్తంగా అవే మెసేజ్‍లు. అప్పుడు గుర్తొచ్చింది, తన ఫ్రెండ్‍కు మాటైనా చెప్పకుండా వచ్చేసాడని. ఫోన్ చేసి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఒక వారం పాటు అమ్మను చూసుకోవడంతో సరిపోతుందనీ, తాను రాలేననీ, ఇంటి నుండి చేసే ఏ పనులైనా చేస్తాననీ చెప్పాడు. ఫ్రెండ్ “టేక్ కేర్” అంటూ ఫోన్ పెట్టేసాడు.

ఇంతలో వాళ్ళ అక్క ఫోన్..

“ఏరా? అమ్మకెలా ఉంది?”

“కాలు కొంచెం నొప్పిగా ఉందననింది. ఇప్పుడు పడుకుందిలే. డాక్టర్ గాభరా పడాల్సింది ఏం లేదన్నారు.”

“ఏమన్నా తినిందా?”

“లేదు. బ్రెడ్ కాల్చి ఇచ్చాను. ఒక ముక్క తినింది. ఇడ్లీ తెప్పిస్తానన్నాను. వద్దంది. జ్యూస్ చేసి ఇచ్చాను. తాగిపడుకుంది.”

“కనీసం పాలు కూడా తాగదు మనిషి. మజ్జిగుందా? మళ్ళీ అర్థరాత్రి లేస్తే, ఇవ్వడానికి బాగుంటుంది.”

“సరే.. చూస్తాను.”

“నువ్వేమన్నా తిన్నావా?”

“అహ.. ఏం లేదు. ఏడే అవుతుందిగా!”

“నిజం చెప్పరా! అంతా బానే ఉందా? నన్ను రమ్మంటావా? నేను కంగారు పడను.. నువ్వు నిజం చెప్పు..”

“అంతా ఓకే అక్కా.. నిజం! నా మాట నమ్ము..”

“నీ గొంతెందుకు అలా ఉంది మరి? ఏడ్చావా?”

“ఛ! అదేం లేదు. ఇవ్వాలంతా ధర్నాలో ఉన్నా కదా, అక్కడంత నినాదాలు అరిచి..అరిచి..”

“నా మీద కోపంగా ఉందా? అమ్మను వదిలేసి, నేనిలా…”

“అదేం లేదు. ఇది ఒక ఆక్సిడెంట్ అంతే!”

“అక్కడంతా గోలగా ఉందని, మొబైల్ సైలెంట్ పెట్టాను. నీ మెసెజెస్ చూసేసరికి తలతిరిగింది. సారీ!”

“హమ్మ్.. “

“కానీ నిజం చెప్తున్నాను అక్కా.. అసలు ఇండియాలో ఇలాంటిదొకటి సాధ్యమని కూడా నాకనిపించలేదు. కానీ ఎంత మంది జనం తెల్సా! ఇన్నాళ్ళూ ఎంత అవినీతికి, అక్రమమానికి గురైయ్యారో.. అదంతా చూపిస్తున్నారు. అందరూ ఒక్కడి కోసం. ఒక్కడు అందరి కోసం. వావ్ ఫీలింగ్..”

“దేశ చరిత్రను తిరగరాస్తున్నామన్న ఫీలింగ్. మనక్కావాల్సింది మనం సాధించుకుంటున్నామన్న ఫీలింగ్. ఆ చరిత్రలో నేనూ భాగం! గర్వంగా ఉంది నాకు..”

“ఏం మాట్లాడవూ? నీకనిపించటం లేదా?”

“ఇవ్వన్నీ పట్టించుకునే స్టేజ్ దాటేసాను హేమూ.. “

“అంటే, నువ్వు ఆంటీ-అన్నా?”

“ఏమో..”

“ఇప్పుడు ఫోన్ పెట్టేయకు ప్లీజ్.. అనన్య ఏడుస్తుందనో, బావ పిల్చాడనో, అత్తగారు నసిగిందనో. నాకు తెలియాలి. నువ్వెందుకు పట్టించుకోవటం లేదు. ఎప్పుడు చూడు ఆ ఫ్యామిలీ, లేకపోతే ఈ ఫ్యామిలీ? ఇవి తప్ప ఇంకో లోకం లేనట్టుంటావే?! చెప్పు.. పెళ్ళవ్వగానే షాపింగులు మానేస్తారా మీ ఆడవాళ్ళు? మానరే! కానీ జీ.కెలూ, కరెంట్ అఫైర్సూ .. పాలిటిక్స్.. స్పోర్ట్స్ … హహ్??”

“హహహహ.. శిరీష చాలా షాపింగ్ చేయిస్తుందా ఏంటి నీతో? అయినా, మా జీవితాలే షాపింగ్-మయం.. ఇంటగ్రెల్ పార్ట్.. “

“ఏదన్నా అంటే అర్థం కాకుండ మాట్లాడతావూ..”

“సరే రా! నేను తర్వాత మాట్లాడుతా”

“అక్కా.. ఆగు. నేను చెప్పానా ఫోన్ పెట్టొద్దని? ఆగు. ఏంటి ఏడుస్తున్నావా? నేనేదో సరదానికి అన్నాను.”

“లైన్లో ఉండు..”

ఒక రెండు నిముషాల పాటు నిశ్శబ్దం.

“అక్కా? ఉన్నావా? ఐ యామ్ సారీ! నిన్ను నొప్పించాలని అనలేదు.. ఏదో జనరల్‍గా..”

“నాన్న గుర్తొచ్చేసారు. అందుకని. ఇందుకే నేను ఫోన్ పెట్టేస్తా అనేది. నేను ఫస్ట్ క్లాస్‍లో ఉండగా, పరీక్షల్లో మొదటి రాంక్ వస్తే బార్బీ డాల్ కొనమని అడిగాను నాన్నను. తప్పకుండా అన్నారు. నాకు మొదటి రాంక్ వచ్చింది. నాన్నకు చూపించాను. “నాకో వారం రోజుల సమయం ఇస్తావా? అమ్ములూ.. నీ డాల్ తెచ్చిస్తా” అని అనడిగారు. ముందు కొంచెం ఏడ్చి, ఆ తర్వాత ఒప్పుకున్నాను. వారం అయ్యాక నాన్న బొమ్మ తెచ్చిచ్చారు. తెగ సంబరపడిపోయాను. ఎగిరి గంతులేసాను. అందరికీ చూపించాను. కానీ నాన్న మీద అలిగాను. రోజూ ఆరింటికళ్ళా వచ్చి నాతో ఆడుకునే నాన్న, నేను నిద్రపోయేవరకూ రావటం లేదని. అప్పుడమ్మ చెప్పింది, నా బొమ్మ కోసం నాన్న ఓవర్‍టైం చేస్తున్నారని. “బొమ్మ కొనేసారుగా” అని అడిగాను.. అమ్మ “మనం ఇంకా బోలెడు కొనుక్కోవాలిగా” అంది..

“అప్పుడు నాకు తెలీలేదు, నాన్న ఏ బొమ్మ కోసం అంతగా పనిజేస్తున్నారో! పదిహేనేళ్ళ తర్వాత, నాకు బార్బీ బొమ్మ కొనిచ్చినప్పటి సంతోషం మళ్ళీ నాన్న కళ్ళల్లో చూసాను, నా పెళ్ళిలో. బావంటే నాన్నకు చాలా ఇష్టం. తనే అల్లుడు కావాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందుకే నాకు కొనిచ్చారు, లక్షలు పోసి, ఓ జీవితకాలం ఓవర్‍టైం చేసి. ఆడవాళ్ళకు షాపింగ్ తప్పనిసరి. That we’ve to shop for husbands too, makes it even more… “

“అక్కా.. సారీ! నేను వాగకుండా ఉండాల్సింది..”

“నో.. అదేం లేదు. నాకే ఏం అర్థం కావటం లేదు. నేను పుట్టడానికి ఓ ఇరవై ఏళ్ళ ముందు ఆంటీ-డవ్‍రీ లా వచ్చింది. అంటే, నేను పుట్టే సమయానికి కట్నం అన్న మాట తుడిచిపెట్టుకుపోయుండాలి. కనీసం ఆ మాటంటే వెగటో, భయమో పుట్టుండాలి సమాజంలో. అలా కాక, కట్నం ఒక సనాతన ఆచారంగా వస్తూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే, చంపుకునే వాళ్ళు చంపుకోగా, పనులకు పంపించేవాళ్ళు పంపించగా, అబ్బాయిలతో సమానంగా విద్యాబుద్ధులు చెప్పించిన మన అమ్మానాన్నల్లాంటి వాళ్ళు, అన్నీ చేస్తూనే కట్నం ఇచ్చుకోగలిగినంత డబ్బు పోగు చేసారు. సింపుల్‍గా చెప్పనా? నేను అబ్బాయై ఉన్నా, లేక నువ్వొక్కడివే కొడుకైనా నాన్నకు మంచి లొకాలిటిలో ఇల్లుండేది, ఇప్పుడున్న చోటు కాకుండా! నాన్నకొక మంచి బైక్ ఉండేది, డొక్కు లూనా కాకుండా. నాన్న ఇప్పటికి రిటైర్ అయ్యి, అమ్మను విసిగిస్తూ ఉండేవారు. అనారోగ్యం కలిగి, చిన్న ఆక్సిడెంట్‍ నుండి కోలుకోలేక….”

ఒక రెండు నిముషాల పాటు మాటలు లేవు. కన్నీటి మధ్య ఊపిరి తీసుకునే తాలూకు శబ్దాల తప్ప..

“..సో! నాకు తెలీదు అన్నా హజారే ఎవరో! ఎందుకు నిరహారదీక్ష చేస్తున్నారో! జన్‍లోక్‍పాల్ బిల్ అంటే తెలీదు నాకు. అందులో ఏముందో తెలీదు. దాన్ని ఎలా వాడుకోగలమో తెలీదు. అది పనిజేస్తుందన్న నమ్మకం కలగటం లేదు. వెన్నుముక్క లేనివాడికి ఊతకర్ర ఇచ్చి లాభమేమిటి? కనీసం నాకు లేదు నిలబడే ఓపిక. ఉండుంటే, పోలిస్ కేస్ కాకపోయినా, “కట్నం ఇచ్చి చేసుకునే పెళ్ళి నేను చేసుకోను..” అని తెగేసి చెప్పేదాన్ని ఇంట్లో. కాలేజీల్లో డిబేట్లో, ఎలక్యూషన్లలో చాలా మాట్లాడాను, తలెత్తుకొని. పెళ్ళిపీటల మీద తలదించుకున్నాను. నేను తెచ్చిన సారె చూపిస్తూ మా అత్తగారు మురిసిపోతుంటే నిట్టూర్చాను. నాకు వెన్ను లేదు. నిలబడే ధైర్యం లేదు. అప్పుడే లేదు. ఇప్పుడెక్కడ నుండి వస్తుంది? “అన్నా హజారేకి మద్దతునిస్తావా?” అంటే “అవును” అనలేను. అన్నానూ అంటే, ఇప్పటికిప్పుడు రైలు టికెట్లు కావాలంటే నాకు దొరకవు. మా మామగారి ఊర్లో ఇంటి స్థలం రెజిస్ట్రేషన్ పని కాదు. అనన్యకు మేమనుకుంటున్న స్కూల్ లో అడ్మిషన్ దొరకదు. నా స్నేహితురాల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే, అన్నీ మూసుకొని కూర్చొమని సలహా ఇవ్వలేను. ఇవ్వన్నీ అయ్యే పనులేనా? పనులెవడికి కావాలి? ఏదో ఒకటి చెప్తే అయిపోతుందిగా అంటే.. ఏమో.. ఇంకోసారి నన్ను నేను మోసగించుకోలేను. సమాజం, దాని ఆచారవ్యవహారాలంటూ నన్ను గొర్రెల మందలో ఒకరిగా పెంచారు. ఇప్పుడు ఎదురుతిరుగుతున్న మరో గొర్రెల మందలో జేరలేను…

“ఏదేదో మాట్లాడేస్తున్నా.. హమ్మ్.. నేను చెప్పగలిగింది అంతే! నాకు వీటి మీద అభిప్రాయాలు ఏర్పచుకునేంత మేధ ఉన్నా, వాటికోసం నిలబడే సత్తువ లేదు. అలా అని, ఏమీ పట్టకుండా ఉండా లేను. రెంటికీ మధ్య నలగడం తప్ప. మీరంతా కల్సి మార్పు తీసుకొస్తే అంతకన్నానా? కానీ, ఇప్పుడు రోడ్ల మీద గొంతుచించుకోవడంతో, బిల్ పాస్ అయితే స్వీట్లతో సరిపెట్టుకుంటే మాత్రం చాలదు. ఒకదానికి అలవాటు పడిపోయాక, దాన్ని వదిలించుకోవటం తేలిక కాదు. కనీసం ఒకట్రెండు తరాల వాళ్ళు, ముఖ్యంగా అవినీతిలో తెల్సో తెలియకో అంతర్భాగమైపోయినోళ్ళంతా చాలా నిష్ఠగా ఉండాలి. దీక్ష చేస్తున్న అన్నాకు ప్రాణగండమే, ఒక్కసారే! అది నిలుపుకోడానికి ఇంకెన్నో గండాలు దాటుకోవాలి. ఈ వేడిని నిలుపుకోవాలి. ప్రలోబాలకు లొంగకూడదు. అడుగడుగునా తప్పుటడుగు వేయాల్సి రావచ్చు. కానీ వేయకూడదు. కనీసం మూడో తరం నుండైనా మార్పు సుస్పష్టమవుతుందని నా ఉద్దేశ్యం. చట్టాలు చేసి, అటకలెక్కించే పనైతే.. ఇవ్వన్నీ దండుగ కదూ!..

“సరే.. చాలా సేపయ్యింది. మళ్ళీ మాట్లాడుతా! అమ్మ జాగ్రత్త. నువ్వేదొకటి తిను.. మానేయక..”

“అలాగే.. గుడ్‍నైట్!”

“గుడ్‍నైట్”

“ఒక మాట.. నువ్విలా ఒక మూవ్‍మెంట్‍లో ఆక్టివ్‍గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాని వల్ల ప్రయోజనాలు తెలియకపోయినా, క్రికెట్లో గెల్చినప్పుడే కాక, మిగితా సమయాల్లో, the youth of this nation wants to get counted అన్నది చూపిస్తున్నారు. నా వాగుడుకేం గానీ, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏదైనా సరే, ఎక్కడో చోట మొదలవ్వాలిగా..”

“హమ్మ్..”

“ఉంటాను మరి. ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా పడుకో.. ఏదోటి తిను.. మజ్జిగ, కొన్ని పళ్ళూ తీసి పెట్టుకో, ఒకవేళ అమ్మ లేచినా వీలుగా ఉంటుంది..”

“సరే.. నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మ రేపుదయం చెప్తుంది నీకు, నా సేవా కార్యక్రమాల గురించి..”

“హహహ..సరే.. బై”

“బై..”

ఫోన్ పెట్టేసి లాప్‍టాప్ దగ్గరకు వచ్చాడు. తెరచి ఉన్న విండోలో..

Do You Support Anna Hazare? అన్న ప్రశ్న కనిపించింది. అతడి స్నేహితులంతా “యెస్” అన్నారని చూపిస్తోంది. అతడు ఏదీ ఎన్నుకోలేకపోయాడు. “యెస్” పెట్టేదామనుకున్నాడు. కానీ మౌజ్ వత్తబోతున్నప్పుడు, చేతులు వణికాయి. విండో క్లోస్ చేసి, మనసు బాలేనప్పుడు ఖచ్చితంగా వినే పాటలను యూ ట్యూబ్‍లో తెరిచాడు. పాటలు వింటూ, కాసేపు సేద తీరాడు.

హమ్మ్.. ఇంకో గంటలోనో, రేపో, ఎల్లుండో మళ్ళీ ఫేస్‍బుక్ తెరవకపోడు గదా! అప్పటికి అతడి నిర్ణయం “అవును” అనే ఉంటుందనీ, ఆ “అవును”కి అతడో జీవితకాలం బాటు కట్టుబడి ఉండడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తాడనీ కోరుకుందాం.

అ – అమ్మ. ఆ – ఆలి.
నేను నిన్ను కనలేదు.

నా ఉనికి కారణమైన మనుషులిద్దరూ ఒకరికి ఒకరు తెలియక మునుపే మీ అమ్మ నిన్ను కనేసింది; తొమ్మిది నెలల పదకొండు రోజులు నిన్ను తనలో మోసి. ఆ మోయటంలో తన ప్రాణానికే ముప్పు పొంచుండచ్చన్న సంభావ్యతను బేఖాతరు చేస్తూ. పెంచింది; ప్రపంచం కోసం నిన్ను సంసిద్ధుణ్ణి చేస్తూ. ఆకలికి, నొప్పికి, నచ్చకపోవటానికి నువ్వొకే ఏడుపును ఆశ్రయించే రోజుల్లో నీ బాధను నిర్వచించగలిగింది. నీ బోసి నవ్వుల్లో తానో పసిపాప అయ్యింది. ఆమెకు నువ్వో ఆటబొమ్మ. ఆమె నీకో పట్టుకొమ్మ.

కని, పెంచి నాకు అప్పజెప్పింది, పాతికేళ్ళ వాణ్ణి. ఆవిడలా మన పిల్లల్ని పెంచుకోవాలనుకున్నాను గానీ, నిన్నూ.. ఎలా చెప్పను?

నా ముద్దూ ముచ్చటా తీర్చని నిన్ను కాల్చుకుని తినే నసను నేను. నా మాటేదో కాదని, నిశ్చింతగా నువ్వు భోంచేస్తుంటే, సలసలకాగుతున్న నా అసహనాన్ని నీ చేతి మీద వేడి సాంబారుగా వడ్డించే దుర్మార్గాన్ని నేను. తప్పు నావేపున్నా అందాన్ని ఎరగా వేసి నిన్ను కాళ్ళబేరానికి రప్పించుకునే అహంకారాన్ని నేను. నిన్ను అనుమానించకుండా ఉండలేక, అలా అని బయటపడలేక కారణం లేని రుసరుసలు రువ్వే దౌర్జన్యాన్ని నేను. పంతాన్ని నేను. ప్రతీకారాన్ని నేను. పడక్కూర్చీలో నడుం వాల్చి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్న నిన్ను గిచ్చి లేపే పేచీని నేను.

బద్ధకించే నీకు బడితపూజను కూడా నేనే. అలసినప్పుడు జోలను. అపార్థాల బురదగుంటలో పడి దొల్లుతున్న నీకు నాలుగు తగిలించి, మురికి మిగలకుండా కడిగే నీరుని నేను. లోకంతో గలాటా పడి గాయాలతో వచ్చిన నీకు వేసే మందుని నేను. నీ నిద్ర రానని మొండికేస్తే, నా నిద్రను వెలివేసే సహచర్యాన్ని నేను. అంతర్ముఖుడివై ఇహాన్ని మరిచిన నీ మీద ఓ కన్నుంచే పర్యవేక్షణను నేను. బయట రుచులు మరగకుండ నీ ఆకల్ని కనిపెట్టుకుండే అన్నాన్ని నేను. ఇప్పటికీ.. ఇప్పటికీ.. కోపానికీ, అసహనానికీ, బాధకీ, ఆకలికీ ఒకటే మౌనాన్ని ఆశ్రయించే నీ భావోద్వేగాలను చదవగలిగే మనస్తత్వవేత్తను నేను. నీ మనసుపై ఉన్న ఏకైక పరిశోధనగ్రంధాన్ని నేను.

సత్యను నేను. యశోదనూ అయ్యాను. నాకూ, నీకూ తెలీకుండానే నేను ఎప్పుడో నిన్ను కన్నాను.

లేని కథ
రాముడు కాదనుకున్న సీతను చితి ఆహ్వానిస్తుంది, కోన ఆశ్రయమిస్తుంది, భూమి తనలో దాచుకుంటుంది.

వాల్మీకే వద్దనుకున్న సీతను. లేని కథకు నాయికను.

దాహం.
కంటి అంచుకీ రెప్పకీ మధ్య ఏర్పడిన సూదిమందమంత సందులో తళుక్కుమన్న వెలుతురు, మసగ్గా, అస్పష్టంగా సూదిమొనలాంటి నా ముక్కు కొస, చెక్కినట్టున్ననీ  చెక్కిలి: నిద్ర మత్తు వదలని కంటిరెప్పలు, నాటకం మొదలవ్వడానికి ముందు తెర లేచినట్టుగా మందగమనంతో పై పైకి లేస్తూ వరసుగా సాక్షాత్కరింపజేసిన దృశ్యాలు.

మెళుకువ వచ్చి రెప్పలు పూర్తిగా తెర్చుకున్నాక కనపడినవి: నిద్రలో తెరచుకున్న నీ పెదాలకు మల్లే మన ఇరు దేహాలు; ఓ చోట కలిసి, మరో చోట విడిపోయి.

ప్రేమించుకున్నాం. పెళ్ళయ్యింది. నిన్న రాత్రి ఒకటయ్యాం.

అయ్యామా? అయితే, ఇంకా ’నేను’ ఎలా ఉన్నాను? ఎందుకున్నాను? చీకటింట తపస్సు ఫలించి ప్రాప్తించే స్వర్గం మిణుగురు మెరుపంత క్షణికమా? దీనికోసమా ఇంత వెంపర్లాట? నిన్ను ప్రేమించినంతగా నిన్ను సొంతం చేసుకోలేనా? సొంతమవ్వలేనా?

నాకీ క్షణాల సుఖాలు, అర్థ భాగాలూ వద్దు. నువ్వు కావాలి. మొత్తంగా. నేను నీదాన్ని అవ్వాలి. పూర్తిగా.

చాచున్న నీ చేతులపై నా చేతులు చాస్తూ, నీ చీలిమండలను తాకేలా నా పాదాలను సాగదీస్తూ, శ్వాసనిశ్వాసల కారణంగా ఏర్పడ్డ నీ ఉదర చలత్పలకం పై నా కడుపును ఆనుస్తూ, నీ గెడ్డానికి నా నుదురు తగులుతూ, నా కురులు చేసే అల్లర్లు నీ చెంపలను మీటుతున్నప్పుడు, స్పందనగా నువ్వు వాటిని ముద్దాడుతున్నప్పుడు..ఆ క్షణాన, మంచుపలకగా ఘనీభవిస్తున్న నీటి సమూహం మీద బరువుగా అడుగు మోపగానే ఉపరితలం భళ్ళున పగిలి నీటిలోకి జారిపోయినట్టు, నేను నీలోకి జారిపోతే! లోపలికి ప్రవేశించగానే బయటకొచ్చే మార్గాలు వాటంతటవి మూసుకుపోతే! నీ తనువే నా కొత్త నివాసమైతే!

“అయ్యో..” లేపేసానా? పడుకో. పడుకో.

అలా నీ లోపలికి వెళ్ళిపోగలిగితే ఎంత బాగుంటుంది?! నీ వేదన్ని స్పాంజిలా పీల్చేసుకొని, నీ ఆనందంతో బుడగలా తేలిపోతూ, నీ కోరికనై, నీ ఆకలినై, నీ చీకట్లలో చీకటినై, నీ యదసడినై, నీ ఊపిరినై, నిన్ను సంపూర్ణుడిని చేయగలిగితే ఎంత బాగుణ్ణు కదూ! నీ నుండి వేరుగా ఉనికే లేకపోతే బాగుణ్ణు. ఒక మాట చెప్పనా? నీ లోపల అసలు అల్లరి చేయను. కొంచెం కూడా. ఎప్పుడో బాగా సంతోషమేసినప్పుడు నీ గుండెను డ్రమ్స్ అనుకుంటాను. మస్తిష్కమేరు ద్రవంలోకి ఎత్తు నుండి దూకి జలకాలాడుకుంటాను. నీలో ఒక కణం నుండి ఇంకో కణానికి కుప్పిగంతులు వేస్తాను. పక్క ఎముక మీద జారుడుబండ మీద జారినట్టు ఆడుకుంటాను. ఇలాంటివేవో తప్పించి అసలు అల్లరి చేయను. నిజం.

లేచావా? “గుడ్ మార్నింగ్!”

“నేనా? ఏం లేదు. ఊరికే.” దొంగ! ఇందాకనగా లేచి చాటుగా గమనిస్తున్నావా? వేషాలకేం తక్కువ లేదు.

చెప్పనా? నాకేమనిపిస్తుందో చెప్పనా? ’కామపిశాచి బాబోయ్’ అని పారిపోవూ? అయినా నాకింత దాహమేమిటి? పరిచయం లేని ఈ మెరమెరపాటేంటి? సంద్రంతో సంగమించాక, ’ఇది నా నీరు. ఇది నీ నీరు.’ అని అనే అవకాశం నదికి ఉండదు. కాని నాదింకా నా శరీరమే. నీది నీదే!

“ఐ లవ్ యు టూ.. బేబీ!” చెప్పలేనంత. చూపలేనంత. పంచుకోలేనంత. నా దాహమంత.

ఇది కల కాదు! (ఏమో..)
నా ఊపిరికి మరో ఊపిరి జతకూడి, బరువెక్కి బుసులుకొడుతోంది. నిద్రాణమై ఉన్న తాపాగ్నికి కొత్త ఊపిరి పోస్తోంది. నీడను నీడ ముద్దాడుతున్నట్టు, అంత దగ్గరైనా ఆ జత పెదవులు నోటికి అందవేం? ఆ ఊపిరిని అనుసరిస్తూ, ఆ పెదవుల కోసం అర్రులు చాస్తూ పై పైకి లేస్తూ..

ఎత్తైన శిఖరం నుండి కాలు జారి నదిలోకి మునకేసినట్టుగా మెళకువలో పడ్డాను. చీకట్లో చేతులతో తడిమితే, సుబ్బరంగా నిద్ర పోతున్న మా ఆయన! అతడి పని కాదు.

కల? ఛీ! ఏంటి ఇలాంటి పాడు కల వచ్చింది? ఏం ఆలోచిస్తున్నానసలు? కల అర్థమేమిటి? గూగుల్ చేద్దామని, లేచి కూర్చొని మంచం మీద వెతగ్గా చేతికి చిక్కింది మొబైల్‍. ఆన్ చేసాను. ఆ వెలుతురులో ఒక అస్పష్టాకారం.

అంటే ఇది కల కాదు?! గుండె ఝల్లుమంది! వెన్నులో వణుకు పుట్టింది. నా మంచం మీద నాకు తెలీకుండా మరో మనిషి!

“హే.. హే..” అని మెల్లిగా అనబోయాను, భయంగా. నోట మాట పిగల్లేదు. దుడుకుగా మా ఆయన వైపుకి దూకి, ఆయన్ని తట్టి లేపాను.  లేవటం లేదు. ఆందోళనలో గట్టిగట్టిగా కొడుతున్నాను. అయినా లేవడేం?

మొబైల్ లైట్ పోయింది. చీకటి. అంతా నా భ్రమేమో అనిపించింది. దాన్నే బలంగా నమ్మి పడుకోబోయాను. ముసుగుతన్నబోతుంటే నా కాళ్ళు ఆ ఆకారానికి తగిలాయి. చటుక్కున “సారీ!” అంటూ గుండెల మీద చేయి ఆన్చుకొని సంప్రదాయబద్ధంగా క్షమాపణలు చెప్పాను. సారీ? మై ఫుట్! కాలికేదో తగిలిదంటే నాది భ్రమ కాదన్న మాట.

“హే.. ఎవ..ర..ది?” – అక్షరం అక్షరం ఏరుకొని ఏరుకొని పలికాను.

తడుముకుంటూనే బెడ్ లాంప్ ఆన్ చేసాను. అస్పష్టాకారం స్పష్టమయ్యేకొద్దీ మరింత అస్పష్టంగా మారింది. మనిషని తెలుస్తోంది. కాని ముక్కూ, మొహం కనిపించటం లేదు. గుండెకు, వెన్నుకు జతగా, కడుపులో కూడా భయం మొదలయ్యింది.

ఒక ఉదుటున మా ఆయన పక్కగా జేరాను. ఎంత కుదిపినా, నిద్రలేవడేం? లాభం లేదు. నేనే ఏదోటి చేయాలి. నాకు అర్జెంటుగా కావాల్సింది ధైర్యం. అంటే, భయం లేదన్నట్టు నటించటం.

“హే.. చీకట్లో నక్కటం కాదు. ధైర్యముంటే నా ముందుకురా!” – టేక్ ఓకే అయింది, మనసులో ఒక పది కట్లు చెప్పుకున్నాక.

నా వాక్యం ఇంకా పూర్తి కాక ముందే, చేతులు కట్టుకొని, బుద్ధిగా బెండ్ లాంప్ వెలుతురు పడుతున్న చోట తల తిప్పాడు. డు-నే! అనుమానం లేదు. నాకు తెల్సున్న మనిషో, కాదో తేల్చుకోడానికి మొహాన్ని నిశితంగా చూసాను. తల మీద జుట్టుంది. తల కింది మెడుంది. తలకి రెండు వైపులా చెవులున్నాయి. కాని, ముక్కూ, కళ్ళు, పెదాలు ఏవీ కనిపించటం లేదు? లేవా? లేకపోతే.. ఇందాకటి ముద్దు సంగతో? వీడి నిర్వాకమా? లేక కలా అదీ? మరి ఇదో? కలలో మెళకువ? ఏంటిది? అప్పటికే కడుపులో ఉండలా తిరుగుతున్న భయం, గొంతుకడ్డ పడి నోట

మాట రాక, కన్నీళ్ళొచ్చాయి. కన్నీరు తుడుచుకోడానికని అలవాటు ప్రకారంగా కళ్ళద్దాలు తీయబోయాను. కాని ఏవి? ఓహ్.. నిద్రపోయేటప్పుడు అద్దాలు తీసేస్తా కదా.. అద్దాలు పెట్టుకోవాలి అర్జెంటుగా. చీకట్లో వెతికాను, చేతులతో. ఏం తగల్లేదు.

నన్ను రేప్ చేసాక, మర్డర్ చేయడానికి సమయం చాలకపోతే, సాక్ష్యాధారాలు మిగలకూడదని వీడే నా అద్దాలు దాచేసుంటాడు.

“అద్దాలు దాచేస్తే నాకేం కనిపించదనుకుంటున్నావ్, కదూ? ఆవలించమన్న సిగ్నల్ వస్తుందని నీకు తెలియకముందే, నీ పేగుల స్కాన్ తీసివ్వగలను, తెల్సా?”

ముందుగా మొబైల్ ఆన్ చేసి, గూగుల్‍ను కేకేసి “నా కళ్ళద్దాలెక్కడ?” అని కొట్టాను. బెండ్ లాంప్‍కు మూడించుల దూరంలో కుడివైపు ఉందని సెలవిచ్చింది. వెంటనే మూడించులు కొలిచి, అక్కడున్నవి కళ్ళద్దాలే అని తీర్మానించుకొని, పెట్టుకున్నాను. ఇక అతగాడిని చూడ్డమే తరువాయి.

“నీ వాయిస్‍లో డెసిబెల్స్ పెరిగాయో, నీ ఆయుష్షులో డెసిమెల్స్ తగ్గుతాయ్! జాగ్రత్త! అసలే మా ఆయన లైట్ స్లీపర్.” అని వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ డైలాగు చెప్పాల్సిన టైంలో గుర్తురాకపోతే కష్టమని.

అతడు బిత్తరపోయి, చీకట్లో దిక్కులు చూస్తుంటే, తమాషాగా అనిపించి చిన్న వికటాట్టహాసం చేసాను.

“మీ నవ్వు చాలా అందంగా ఉంటుందని ఊహించుకున్నానండి. ఇలా ఉంటుందా?” అన్నాడు.

“హే.. మీ? అండి? తె..లు..గా? చెప్పావ్ కావేం?!” అని అంటుండగానే, టివి ఛానెల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చదవడానికి సన్నాహకపూర్వంగా వాడే డప్పు తరహా హెచ్చరికలు వెలువడ్డాయి, లోపలనుండి.

“అంటే ఆసిడ్ బాటిల్? కత్తి? కొడవలి?” అంటూ ముంచుకొస్తున్న చావు ప్రోమోస్ ఊహించుకొని గజగజ వణికిపోయాను.

“ఏంటో? మీరు మాట్లాడుతున్నది తెలుగులా వినిపిస్తోంది.. కానీ అర్థం కావటంలా?” అంటూ నిట్టూర్చాడు.

“ఇంతకీ ఎవర్నువ్వు? – వందో సారి!…

“నా నవ్వు మీద, నా భాష మీద కామెంట్లు వేయడానికి నోరొస్తుందే? ఎవర్నువ్వు – వెయ్యీ రెండో..

“సరే, వదిలెయ్య్! నీ పేరేంటి?”

“మీరేం చెప్పలేదండి.”

“ఏంటి జోకావా? నీకర్థం కావటం లేదు. మనమిప్పుడే కలిసాం కదా, అందుకని పేరాట ఆడుకోవాలి. నీ-నా ఒంటి పేరు, ఇంటి పేరు, ముద్దు పేరు, చదువు పేరు, ఉద్యోగం పేరు, వ్యాపకాల పేరు, ఇంట్లో – పక్కింట్లో వాళ్ళ పేర్లు.. ఇలా ఒకరికొరకం చెప్పుకోవాలి. ఇది అయితే గాని, మనం ఇంకే ఆటలూ ఆడుకోలేం!”

“అదేనండి. కానీ మీరు నాకు  నా పేరేంటో చెప్పలేదండి.” అన్నాడు.

నిద్రలో ఉండటంతో సగం మూసుగుపోతున్న కళ్ళు కూడా విప్పారాయి, ఆ సమాధానం విన్నాక. నీ పేరు నేను చెప్పటం ఏంటి? నా మొహం అని తిట్టుకుంటూ, అతడికేసి చూసాను.

ఏముంది?

అయిపోయింది. అంతా అయిపోయింది. ఎప్పట్నుండో చెప్తున్నారు నాకు, ఇలాంటి రోజోటి వస్తుందని! పోరి పోరి చెప్పారు, “కళ్ళద్దాలు వేయించుకోవే! రెండు కళ్ళూ దొబ్బేస్తే, నీ లాప్‍టాప్‍కు దారాలు కట్టుకొని, మెళ్ళో వేలాడదీసుకొని, హార్మోనియం మీటలు వాయిస్తున్నట్టు నటిస్తూ, “కబోదిని బాబూ..” అంటూ అడుక్కోవాలి. ఈ లోపు నిన్నెవడో మాయచేసి, లాప్‍టాప్ దొబ్బేసి, పాత సామాన్లవాడికేసి, వేరుశనగ పప్పులు కొనుక్కుతినేస్తాడు. అఘోరించు.” అని.

గ్లామర్ కోసం ఫోజు కొడితే, ఇప్పుడు నాకు ఎవరి మొహంలోని రూపు రేఖలు తెలీకుండా, ఫీచర్-బ్లైండ్‍నెస్ వచ్చేసింది. ఇహ, రోజూ మా ఆయన మొహం చూసి మురిసిపోయి, ముద్దెట్టుకునే అవకాశమే లేదు. హయ్యో! ఎంత పని జరిగింది!

దుఃఖం పొంగుకొచ్చింది. ఒక్కసారి మా ఆయన మొహం చూడాలనిపించింది, కళ్ళా(ద్దాల)రా!. నా మనసు చదివినట్టుగా ఇటు తిరిగాడు.

హాశ్చర్యం. అతడి మొహంలో రూపురేఖలు స్పష్టంగా కనిపించాయి. కనిపించాయంటే కనిపించవూ మరి! పాతివ్రత్యం మహిమ అంటే ఇదే! ఎంతగా ప్రేమించానంటే నా కళ్ళు పీకేసినా, నా కళ్ళల్లో అతడే ఉంటాడు, అక్షరాలు చెరిపేసినా సుద్దతో రాసిన గుర్తులు బ్లాక్‍బోర్డ్ మీద ఉన్నట్టు.

అమాంతంగా ప్రేమ ఫ్లడ్ గేట్లు తెంచుకొని పొగింది. అతడి బుగ్గ మీద బుగ్గ ఆన్చి, “ఐ లవ్యూ!” అన్నాను మెల్లిగా, నిద్ర చెదరకుండా.

“ఐ లవ్యూ” – మరో గొంతు వినిపించేసరికి చిరాకేసింది. ఏకాంతంలో సూరేకాంతంలా, ఎవడీడు? అని విసుగ్గా చూసా, హయ్యో.. అతడి మొహంలో ఏం కనిపించటం లేదే!

గబగబా లాప్‍టాప్ అందుకని, అందులో వెతుక్కోవటం మొదలెట్టా, వ్యాధి లక్షణాలు, వైద్య వివరాలు వైగారాలు.

ఏదో నసిగాడు. నేను నా ధ్యాసలో ఉన్నాను. ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన జబ్బైతే అదో రికార్డు. అవునా? కాదా? అన్న రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.

మళ్ళీ ఏదో నసిగాడు. “ఉండవయ్యా” అని విసుక్కుంటూనే, ఏంటని అడిగాను.

“ఐ లవ్యూ?”

నాకు ఒళ్ళుమండిపోయింది. చిర్రెత్తుకొచ్చింది. చేస్తున్న పని వదిలేసి, ఆ మనిషికేసి గుర్రుగా చూస్తూ,

“ఐ లవ్యూ? బుద్ధుందా అలా అనటానికి? ఐ లవ్యూ? ఆయ్‍య్ లవ్‍వ్‍వ్ యూఊఊఊ?? ఛ! మిమల్ని అని లాభం లేదు. చూసే సినిమాలూ, చదివే కథలూ అలా ఏడిస్తే మీరేం చేస్తారు, ఇలా ఏడ్వక? బాబూ! ఐ లవ్యూ చివర్న ఎప్పుడూ చుక్క ఉండాలి. ఐ లవ్యూ. అలా! అలా కాకపోయినా ఐ లవ్యూ అనగానే అవతలి వాళ్ళకి, “ఐ గెస్, ఐ లవ్యూ”, “ఐ లవ్యూ, కండిషన్స్ అప్లైడ్”, “లవ్ మి బాక్!” లా వినిపించకూడదు. పోనీ, అవన్నా వినిపించచ్చు. కాని, అన్నింటికన్నా చిరాగ్గా, “మాదాకోళం తల్లా!” అన్నట్టుగా అసలు వినిపించకూడదు. ఐ లవ్యూ చెప్పేటప్పుడు, ఒక పొగరుండాలి. ఒక దమ్ముండాలి. విన్న వాళ్ళకి కనీసం చిన్న షాక్ తగలాలి. జివ్వుమనాలి. నువ్వు చెప్తుంటే

నీరసం వస్తోంది.

“ఏదీ? వీలైనంత నిటారుగా కూర్చో. ఆ ఛాతిని కొంచెం విశాలం చెయ్యి. వెన్నుని వీలైనంత నిటారుగా పెట్టన్నానా? ఓ క్షణం కళ్ళు మూసుకొని, కడుపులో నుండి ఊపిరి తీసుకుంటూ చెప్పు.. ఐ…”

“ఐ లవ్.. యూ.”

“చూసావా? నేను చెప్పలేదూ! ఎంత బాగుందో కదూ! ఏదో పెదవంచునుండి పరగ్గా నటనరాని సినిమా వాళ్ళలా చెప్పకూడదు! అందులోనూ, అతిగా వాడ్డం వల్ల అరిగి ఇలా చచ్చు పదంలా ఏడ్చింది కాని, అసలు ఐ లవ్యూ ఎంతటి తారకమంత్రమో తెల్సునా నీకు?

“ఇందులో మనకి ’ఐ’ అంటే తెలీదు. క్లీన్ షేవ్ చేసుకొని, బుగ్గను వేలెట్టుకొని, “నేను ఎవర్ని?” అని ఆలోచించటం మొదలెడితే, లోకేషన్ హిమాలయాలకు మారి, అరికాలి వరకూ గెడ్డం పెరిగే వరకూ నిలువు కాళ్ళ మీద తపస్సు చేసినా తిరుగు ప్రశ్నలేని సమాధానం దొరకదు. “బొ..బొ..బొ..” అంటూ కోడిపిల్లను బుట్టకింద కప్పెటినట్టు, అసలు ఆ ప్రశ్నను తప్పించుకోడానికే ఈ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ!

“లవ్ దగ్గరకు తర్వాత వద్దాం. ముందు “యు” సంగతి చూద్దాం. మనకి ’ఐ’ గురించే ఏం తెలీదు. ఇంక ’యు’, ఎలా తెలుస్తుంది? తెలీదు. తెలిసే వీలు లేదు. తెలీకోడదు కూడ. అందుకనే ప్రేమ!

“’లవ్ ఇస్ బ్లైండ్’ అంటే అదేమీ న్యాయదేవతలా నల్లకళ్లగంతలు కట్టుకొని తిరుగుతుందని కాదు. మనకి గంతలు కడుతుంది. రంగురంగు గంతలు! బహుచక్కని గంతలు.

“మనకి కట్టినట్టే అవతలి వాళ్ళకి కట్టిందనుకో, ఆహా.. గంతలు కట్టిన శుభవేళ! ఒకటే కలవరం. పలవరం. వరం. పెళ్ళవుతుంది. పెళ్ళి ఫోటోల్లో, ఫోటోలు తీసేవాడు “దగ్గరకు జరగండి, దగ్గరకు” అంటూ మిల్లీమీటరు సందుకూడా లేకుండా కొత్త మొగుడూ పెళ్ళాల్ని నించోబెట్టి తీస్తాడు. పళ్ళికిలించమంటాడు. దాన్నే, ఆ తర్వాత పెద్దగా చేయించి గదుల్లో పెట్టుకుంటారులే. పెళ్ళంటే అంతే! పక్కపక్కన నిల్చునేటప్పుడు ఒక పక్క ఫెవికాల్ పూసుకొని నుంచోవటం. ఒక చేయి, ఒక కాలు, ఒక భుజం బలంగా అంటుకుపోతాయి. అసలు పెళ్ళైన కొత్తల్లో అన్నేసి

గుసగుసలు ఎందుకంటావ్? ఇదో.. ఈ ఫెవికాల్ త్వరగా ఆరిపోవడానికి “ఉఫ్-ఉఫ్” అనటం అన్న మాట. దగ్గరతనం ఏర్పడాలన్న ఆత్రుత. ఇవతలి కాలూ, చేయి మాత్రం స్వతంత్రంగా ఉంటాయి. ఒక వైపు బంధం. ఒక వైపు స్వేఛ్ఛ. ఏదీ పూర్తిగా దక్కదు. ఏదీ కుదురుగా నిలువనీదు. ఆ రెంటికీ సమన్వయం కుదర్చడానికే చాలా పాట్లు. ఇహ, “నేను ఎవర్ని?” అన్న ప్రశ్న రాదు.

“మనకి గంతలు కట్టి ఒకర్ని చూపించి, వాళ్ళకి గంతలు కట్టకపోతే? ఏముంది? గంతల పుణ్యమా అని త్రిడిలో బ్లాక్ ఆండ్ వైట్ కలలు. వైట్ నువ్వు. ఉంటావ్. ఆమె బ్లాక్. బ్లాంక్. ఉండదు. ఉన్నట్టు ఆశ రేపుతుంది. నువ్వు రెచ్చిపోతావ్. వాస్తవం మొట్టికాయ వేస్తుంది. కల చెదురుతుంది. ఏడుపొస్తుంది. వస్తూనే, మరో అవకాశం ఉండచ్చు కాబోలునన్న బూటకపు నమ్మకాన్నీ తెస్తుంది.. మళ్ళీ కలలు. కలవరాలు. శాపాలు. ఇంతటి అవస్థలో “నేనెవ్వర్ని?” అన్న ప్రశ్న అప్పుడప్పుడూ వచ్చినా, ఆమె జ్ఞాపకం మరల్చేస్తుందిలే!

“చూసావా? ఐ-లవ్-యూ ఎన్ని విధాల…”

ఏడీ? జపం చేస్తున్నాడా? ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. ఆపరా నాయనా. నిద్రపోతున్నాడు మా ఆయన!

ఇంతలో ఎవరో ఏడుస్తున్న చప్పుళ్ళు. వెక్కిళ్ళు. చీదుళ్ళు. ఎవరది? నా బెడ్‍రూమే దొరికిందా, అందరికీ?

అమాంతంగా వెలుతురు మూడో వ్యక్తి మీద పడింది. ఓహ్.. మా ఆయన్ని లెక్కెట్టాలిగా. నాలుగో వ్యక్తి. ఆడపిల్ల. బుడబుడా కార్చేస్తోంది. ఆ దెబ్బకి ఈ ముక్కూ-మొహం కనిపించని శాల్తీ జపం మానేసాడు.

“ఎవరమ్మాయ్ నువ్వు?”

“బాగుంది. పేరేంటి?”

“మీరు చెప్పలేదండి.”

“అబ్బా! ఈ నేను-చెప్పకపోవటాలు ఏంటి తల్లీ? ఇంతకీ ఎందుకేడుస్తున్నావ్?”

అంతే! నేనేదో కొరడా దెబ్బలు కొట్టినట్టు, పొలుపొలో శోకాలు ఎత్తుకుంది. మా ఆయన నిద్ర పాడుచేయడానికే దాపురించారు వీళ్ళంతా. పోండి! పోండి అవతలకు. నిద్రపోనివ్వరు మనిషిని.

ఆ పిల్ల ఏడుపాపటం లేదు. గుక్క తిప్పుకోడానికి తీసుకొన్న అరసెకను ఖాళీలో ఈ శాల్తీకేసి చూస్తోంది. మొరాయిస్తున్న ఏడుపింజన్ను పట్టి పట్టి లాగుతోంది.

“అతడి కోసం వచ్చావా?”

“రాకుండా ఉండాల్సింది.”

“వచ్చేసావ్‍గా?”

“అదే బుద్ధి పొరపాటు.”

“ఏది?”

“అతణ్ణి…”

“నిన్ను ప్రేమించలేదా? అతడు?”

“అయినా వచ్చావంటే? ఆశ చావక?”

“ఆశను చంపుకున్నాను. ఆత్రాన్ని దాయలేకపోతున్నాను.”

“ఇహ.. ఉండదులెండి. మీరూ మీరూ ఒకటయ్యాక, నేనేం అయిపోతేనేం?”

“వాట్ నాన్‍సెన్స్? మీరూ, మీరూ ఏంటి?”

“అతడితో మీకు నచ్చిన విధాన ఐ-లవ్యూ నేర్పించి మరీ చెప్పించుకున్నారే?! ఇష్టం లేకనేనా?”

ఓహ్..ఎంత పొరపాటు. నా మీద ఆశ పెట్టుకొని వచ్చినవాడికి ఖాళీ చేయి చూపించక, దగ్గరుండి ఆశలెలా వ్యక్తం చేయాలో నేర్పానా? అబ్బా! నా నోరు. కాసేపన్నా ఊరికే ఉండదే!

“ఇదంతా మీ వల్లే! మీరే చేసారు. ఎందుకు నాతో ఆడుకోవడం? ఆ పూట, ఆఫీసు నుండి ఇంటికి మా ఇద్దర్నీ ఒకే కాబ్‍లో పంపటం దేనికి? ఆ తర్వాత మా ఇద్దర్నీ బస్‍స్టాప్‍లో నించోబెట్టి వదిలేయడం ఎందుకు?”

నాకేం అర్థం కావటం లేదు. నేను కాబ్‍లో పంపటం ఏంటి? నించోబెట్టి వదిలేయడం ఏంటి?

“అసలేం జరుగుతోందిక్కడ?”

“లేదు. ఆమె మాటలు పట్టించుకోకండి.  మీ పనుల వల్ల మీరు మళ్ళీ మమల్ని పట్టించుకోకపోతే అది మీ తప్పు కాదు.”

“అదీ అతడి మనసు. ఇట్టే కరిగిపోతుంది. కరిగించేస్తుంది.”

కరుగుతూనే కరిగించేది.. ఏమటది? పొడుపు కథగా అడగచ్చు. ముందు, ముఖ్యంగా “మీరిద్దరూ ఎవరు? మీకు నేనెలా తెల్సు?”

“ఇహ, ఒక్క క్షణం కూడా నేనిక్కడుండను.” అంటూ విసురుగా వెళ్ళిపోబోయింది. ఆమె ఒక చేయి, అతడి చేతిలోకి వచ్చింది. వాళ్ళద్దరి మధ్య నాలుగైదు అడుగులు దూరమున్నా. అతడు ముందుకు తూలబోతుండగా, అతడి నా చేతిలోకి వచ్చేసింది. మా ఇద్దరి మధ్యా మూడగుల దూరమున్నా. నన్నా చేయి పట్టి లాగుతుండగా, నా చేయి మా ఆయన చేతిలోకి…..

చేరలేదు, నేను అరడుగు దూరంలోనే ఉన్నా!

ఆమె అతణ్ణి ప్రేమిస్తుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మా ఆయణ్ణి?? ప్రేమించటం లేదా? మరి నా చేయెందుకు వెళ్ళలేదు?

లే! మధూ లే! వీడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. నిద్ర లే! నన్ను కాపాడుకో.

ఉన్నట్టుండి మా ఆయన భుజాల్లో నుండి ఒక అరడజను చేతులు పుట్టుకొచ్చాయి. ఒక్కటీ నన్ను పట్టుకోలేదు. ఒక్కోటిగా గోడల్లోంచి బయటకెక్కడిక్ వెళ్ళిపోయాయ్. ఈ ముక్కూ-మొహం కనిపించని శాల్తీది కూడా ఒక చేయి పుట్టుకొచ్చి, అలా సాగి..పోతూ..

తేలిపోయింది. మా ఆయనకు నేనంటే ప్రేమ లేదు. నాకుంది. ఖచ్చితంగా ఉంది. కాని మాయదారి చేయి, అతణ్ణి పట్టుకోవటం లేదు.

“ఆ అమ్మాయినెంత ప్రేమించాడో. ఆ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ ప్రేమంతా. తర్వాత మిమల్ని. అంతే ఇదిగా. నేనే ప్రత్యక్ష సాక్షిని. కాని మీరిలా హాండ్ ఇస్తారనుకోలేదు.”

“నేనేం కావాలనివ్వలేదు.”

“ఎవ్వరూ కావాలని ఇవ్వరు. ఇచ్చినా, ఇస్తున్నారనుకోరు.”

“నా చేయి నాకు వెనక్కి కావాలి.”

“మొండి చేయి కదా చూపించారు? అది కూడా వెనక్కి లాగేసుకుంటున్నారా?”

మొండి చేయేమిటి? ఏం మాట్లాడుతోంది? ఒకసారి అక్కడి దృశ్యాన్ని నిశితంగా చూసాను. ఓహ్! నిజమే. చేతులైతే బయలుదేరాయిగాని, అన్నీ మొండివి.

అంటే.. అంటే.. ఆమె అతడిచే నిరాకరించబడింది. అతడు నాచే నిరాకరించబడ్డాడు. ఓ చేయి ఎక్కువ వచ్చిందంటే, ఇంకెవరో కూడా నిరాకరించుంటారు. మా ఆయన చేతిలోకి నాది గానీ, నా చేతుల్లో ఆయనది గానీ లేదు. అంటే.. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. హహహ.. మేం ప్రేమించుకుంటున్నాం. ఐ లవ్యూ బేబీ.. ఐ లవ్యూ… నా బంగారు కొండ. నా పగడాల కోట.

“హే.. ఆట భలే గమ్మత్తుగా ఉంది. Human chain of unrequited loves! తీరని వలపుల మానవ హారం. బాగుంది. బాగుంది.” అన్నాను చప్పట్లు చరుస్తూ.

“తర్వాత ఏంటి? ఇలా చేతులు ఇచ్చుకున్నాక? అంతేనా? బాలేదు. ఇలా చేతులు పట్టుకొని చిన్నప్పటి రింగ రింగ రోజెస్ రైమ్ చెప్పుకుంటూ గుండ్రంగా తిరిగితే? భలే గమ్మత్తుగా ఉంటుందిగా..” నేనాగలేదు.

ఉన్నట్టుండి, రింగ రింగ పాట మొదలయ్యింది. చిర్రెత్తుకొచ్చింది. “ఆపండి!” అని గట్టిగా అరిచాను. ఆగింది.

“రింగ రింగా రోజెస్..

హార్ట్ ఫుల్ ఆఫ్ ??? (రైమింగ్ వర్డ్ కావాలి.)

హషా! బుషాహ్! ఆల్ ఫాల్ ఫర్..” అని నేనే పాడాను. అందరం గిరిగిరా తిరిగి, ఒక్కసారిగా కిందపడిపోయాం. పైకి లేచాం. దులిపేసుకున్నాం.

మళ్ళీ పాట మొదలు. దాదాపుగా భూగోళమంతా భళ్ళున నవ్వుతోంది. పడుతోంది. లేస్తోంది.

మితిమీరిన ఆనందం వల్ల అలసట. మా ఆయన మరీ అలసిపోయుంటాడు పాపం. ఆరుగురితో ఆడాడుగా.

“ఇది సూపర్ అసలు. నేను వెంటనే, దీని గురించి ఫేస్‍బుక్‍లో రాయాలి. మళ్ళీ మర్చిపోతాను, లేకపోతే.” అని పైకి ప్రకటించి, గబగబా లేవడానికి ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా, ఇదంతా కలేమోనని మేల్కోడానికి ప్రయత్నించాను. కుదర్లేదు.

“కల మర్చిపోతాను. భలే తమాషాగా ఉంది, అందరికీ చెప్పాలి. మెలకువ కావాలీ…”

“మెలకువ వచ్చినా, అది మీది కాదుగా!” అందా పిల్ల.

“నిద్ర నాది. కల నాది. మెలకువ నాది కాక?”

“కల మీదే. నిద్ర మీది కాదు.”

“అంటే???”

“కలగంటున్నారేమోనన్న మీ ఊహ నిజమే. కాని మీ కలలో కాదు. వేరొకరి కలలో.”

“ఏంటీ? అదెలా సాధ్యం?”

ఆ పిల్ల గట్టిగట్టిగా నవ్వటం మొదలెట్టింది. అవును. కలలో సాధ్యం కానిదేముంది? ఏమన్నా అవ్వచ్చు. కానీ, నేను వేరొకరి కలలో కలగంటున్నానంటే.. ఎవరై ఉంటారు?

“నా గురించి కల కంటుంది ఎవరు? అందునా నేను కలగంటున్నట్టూ?”

“ఆవలింత రావడానికి సూచనగా సిగ్నల్ రాకముందే.. పేగులు.. “

హా! కొట్టింది దెబ్బ. ఈ పిల్లకు నేనంటే ఇంత కక్షేమిటి? ఆమెను దీక్షగా చూసాను. ఆ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. చాలా బాగా తెల్సినట్టుంది. చిన్నవే అయినా జీవం ఉట్టిపడే కళ్ళు. సూటిగా చూస్తున్న ముక్కు. పెదాలు. ఆ పెదాలు.. ఓహ్.. ఆ పెదాలు!

“చాన్నాళ్ళ క్రితం నేనో కథ రాసాను. అంటే ఏదో ప్రయత్నించాను. అందులో అమ్మాయి, అచ్చు నీలా ఉంటుంది తెల్సా?”

అమ్మాయి ఠక్కున మాయమయ్యిపోయింది. ఇవతల చూస్తే, ముక్కూ-మొహం తెలీని శాల్తీ నాకేసే చూస్తున్నాడు.

“నీకు తెల్సా? ఆ కథలో ఒక అబ్బాయుంటాడు. కథ వాడి గురించే. కాని వాడెలా ఉంటాడో రాయలేదు. ముఖ్యంగా మొహం…”

వీడూ మాయమయ్యిపోయాడు. తిరిగి చూస్తే మంచం మీద మా ఆయన కూడా లేడు.

ఎవరో నన్ను దారుణంగా ఇరికించారు? నా అంతట నేనొచ్చి ఇరుక్కునేలా చేసారు. నా బెడ్‍రూం. నా మనిషి. నేను రాసుకున్న కథలో పాత్రలతో నన్ను కట్టేసారు. ఎవరు? ఎవరు? నాకు కాక, ఈ కథ గురించి తెల్సిన వాళ్ళూ…

ఠాప్‍మని పుస్తకం మూసేసినట్టు మెలకువొచ్చిందతడికి. చెమటలు పట్టాయి. భయంతో ఒళ్ళు కంపించింది. మామూలుగా ఊపిరి తీసుకోడానికి కాస్త సమయం పట్టింది. చీకట్లోనే మళ్ళీ కలను పునశ్చరణ చేసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా. కలలో ఆమె వచ్చినందుకు నవ్వుకున్నాడు. ఆమె భర్తా వచ్చినందుకు తిట్టుకున్నాడు. మగపాత్ర ద్వారా ఆమె‍కు “ఐ-లవ్యూ” చెప్పించబూనినందుకు, తన పింజారి బుద్ధిని కసురుకున్నాడు. నా కల్లోనూ, నీ దాదాగిరి ఏంటసలు? అని విసుకున్నాడు, తీయగా. తనకు తానుగా కన్న కలలో కూడా, ఆమె ఒక్క క్షణం కూడా తనది కాలేకపోయిందనీ స్ఫురించి కళ్ళంచుల దాకా వచ్చిన నీరు, అతడు రెప్ప మూయడంతో చెంపలపైకి జారింది.

“నువ్వో కలవి..” అంటూ ఎప్పుడో రాసుకున్న కవితలో, కలని కల్లగా మార్చి భావం తూగుతుందో లేదో, సరిచూసుకున్నాడు, రెండు రోజుల తర్వాత.

(శీర్షిక సెన్సార్ చేయబడింది.)
రాత్రి సమయం. కుండపోత వర్షం.

ఆమె వంటగదిలో పనిచేసుకుంటుంది. అతడు తలుపును భళ్ళున నెట్టి రంకెలేయడం మొదలుపెట్టాడు. ఆమె కనిపించగానే తిట్లందుకున్నాడు. మీదమీదకొచ్చాడు.  మద్యం వాసన భరించలేక ఆమె ఈసడించుకొంది. అతడి కోపం పేట్రేగింది. పొయ్యి మీదున్న వేడి పాత్రపై ఆమె చేతిని బలవంతాన ఆన్చాడు. కుడిచేత్తో ఆమె ఎడమ చెంప మీద కొట్టాడు. విసురుగా దూసుకొచ్చిన చేయి అడ్డుగా ఉన్న ఆమె చెంపను చెల్లుమనిపించటంతో కిందకు వాలగా, దాన్ని రివర్సులో లేపి ఆమె ఎడమ చెంపను పగలగొట్టాడు. ఖాళీగా ఉన్న ఎడమచేతి వేళ్ళను జుట్టులోకి జొప్పించి, పిడికెడు నిండగా జుట్టు అందగానే బలంగా వెనక్కి గుంజాడు. తన చేతులను అడ్డుకోబోతున్న ఆమె రెండుచేతులనూ వెనక్కి లాగి పట్టి, ఒక గుప్పిట్లో బంధించాడు, అడొచ్చిన గాజులను నులిమేస్తూ. నిశ్చేష్టగా అతడున్న క్షణకాల సమయంలో ఆమె పెనుగులాడడం గమనించి నోటికొచ్చిన తిట్లన్నీ మొదలెట్టాడు. వాటిని వినలేక ఆమె తల పక్కకు వాల్చి కళ్ళు మూసుకొంది. ఆమె బుగ్గలను, చేతి వేళ్ళకు దవడ మాటున పళ్ళవరస తెలిసేంత బలంగా, చేతుల్లోకి తీసుకుని తలను తన వైపుకు తిప్పాడు. తిప్పి, తన కళ్ళల్లోకి చూడమని గద్దించాడు. ఆమె భయభయంగా రెప్పలు లేపడంతో ఆమె కళ్ళల్లోకి కసిగా చూస్తూ దుర్భాషలాడాడు.

వాన ఉదృతి పెరిగింది. వర్షం చప్పుడు తప్ప మరో అలికిడి వినపడనంత గట్టిగా కురుస్తోంది.

ఉన్న బలాన్నంతా కూడదీసుకొని తలను బలంగా విదిలించింది. అతడి పట్టు సడలింది. తలతోనే అతని రొమ్ములో బలంగా గుద్దింది. దెబ్బకు ఆమె చేతులు రెండూ అతడి గుప్పిట నుండి విడుదలయ్యాయి. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టింది. నొప్పొడుతున్న మణికట్లను, పెదవంచున కారుతున్న రక్తాన్నీ చూసుకుంది. అంతలోనే బీభత్సంగా అరుస్తూ, ఆమె జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చాడు, ఇవతల గదిలోకి. చేతుల్ని గాల్లోకి లేపి ఆరడుగుల తొంభై కేజీలున్న అతడు, ఐదున్నర అడుగుల యాభై కేజీలున్న ఆమెను దూది బస్తాని లేపినట్టు గాల్లోకి లేపి కింద పడేశాడు. అదృష్టవశాస్తూ ఆమె పరచున్న పరుపు మీద పడింది. దురదృష్టవశాస్తూ ఆమె పైట చెదరి, డీప్ కట్ బ్లౌజ్ ఆమె యదపైనున్న నల్లటి పుట్టిమచ్చ అతడికి కనిపింపజేసింది. ఒక్క ఉదుటున ఆమె మీదకు దూకాడు. ఆపిల్ పండును నోట కరచినట్టు, పళ్ళను ఆమె వక్షస్థలంలోకి దింపాడు. నున్నటి చర్మమూ, దాని కింద మాంసం రుచి తగులుతుండగా, పంటి కింద రాయిలా ఆమె మెడలో ఉన్న దండ తాలూకూ నల్లపూసలు కూడా అతడి నోటిన పడ్డాయి. దానితో తాడు తెగి, నల్లపూసలన్నీ వైపరిత్యం సంభవిస్తున్నప్పుడు మనుషుల్లా చెల్లాచెదురైపోయాయి. ఆటవికంగా ఆమెను అనుభవించాడు.

ఎప్పటికో అతడు నిద్రపోయాడు, గుర్రుపెట్టి. ఆమె రెప్ప మూయలేదు. వానాగింది. తడి చెత్తకుప్పల కంపు గుప్పుమంది.

తెల్లారగానే, మెళకువ రావటంతోటే అతడు బయటకు వెళ్ళిపోయాడు. ఆమె ఎప్పటికో లేచి, నల్లపూసలన్నీ ఏరుకొని డబ్బాలో దాచుకొంది. రోజూవారి పనులు మొదలెట్టుకుంది. స్నానం చేస్తున్నప్పుడు వేన్నీళ్ళు ఒంటి మీద పడుతుంటే, తన కట్టెకింకా ప్రాణముందని స్ఫురించింది. రాత్రి భాగోతం మరో కంటికి తెలీకుండా ఉండడానికి ఎక్కువ సేపు అలంకరించుకుంది. పనికి బయలుదేరింది.

ఆమెను చూస్తూనే యజమానురాలు అనుమానంగా మొహం పెట్టింది. అంట్లు తోముతుండగా, పక్కనే వంట చేస్తున్న ఆమె,

“ఏంటి? మళ్ళీ కొట్టాడా నీ మొగుడు?” అని అడిగింది, జవాబు రాదని అనుభవం మీద తెల్సున్నా.

“వాడసల మనిషా? పశువా? పద, పోలిస్ స్టేషన్‍కి.. వాణ్ణి కూడా సెల్లో పడేసి చితకబాదితే తెలుసొస్తుంది.”

“మాట్లాడవేం? వాణ్ణి కాదు. నిన్ననాలి. అసలు నువ్వు మనిషివా? ఇంతిలా చావగొడుతున్నా కిం అనవ్.. నీకు నొప్పుండదా?” అంటూ నిన్న పెనుగులాటలో గాజులు చేసిన రక్తపు చీలికల మీద నీళ్ళేసింది. ఎండిన రక్తం మీద నీళ్ళ చుక్క పడేసరికి, ఒక్కసారిగా రాత్రంతా పడిన నరకయాతనంతా కళ్ళల్లో నీళ్ళుగా తిరగుతుండగా, “నీకు నొప్పుండదా?” అన్న ప్రశ్న గుర్తొచ్చి చిన్ననవ్వు పెదాల మీద తేలాడింది.

ఆ(మె) నవ్వు యావద్భారతదేశానికి సుపరచితమైన చిర్నవ్వు. వెల్లువల్లే ముంచేసే వానలూ, ప్రకృతి వైపరిత్యాలు, మారణహోమాలు, మతకలహాలు, విద్వేషాలు, నిత్యకృత్యమైన ఉగ్రవాద దాడులు – ఇలా ఎన్ని వచ్చినా, రక్తపు మడుగులింకా ఎండక ముందే, శవాలను దాటుకుంటూనే, నెత్తురోడుతున్న శరీర భాగాలను విస్మరిస్తూ, నిల్చుని కన్నీటి చుక్క రాల్చడానికి వీలవ్వని ఆర్థిక, సమాజిక స్థితిగతుల వల్ల, గత్యంతరం లేక మనోబలాన్ని అభినయిస్తూ జనజీవితాన్ని కొనసాగించే ముంబై నగరం పులుముకునేది ఇలాంటి చిర్నవ్వుల్నే కదూ?!

ఒక తప్పిపోయిన ప్రకటన
(గమనిక: తప్పిపోయింది ప్రకటన కాదు. తప్పిపోయిన ఒకదానిని గురించి ఈ ప్రకటన అని గమనింప ప్రార్థన)

పైన లేని ఫోటోలో కనిపించని సదరు అదృశ్య, నిరాకార whatever పేరు నిద్ర. ’సుందరి’, ’దేవి’ లాంటి తోకలు తగిలించుకొని కూడా చెలామణి అవుతుంటుంది. నాబోటి వాళ్ళు ప్రేమాప్యాయతలు అధికమై ’పిశాచి’, ’దెయ్యం’ అని ముద్దుగా పిల్చుకుంటుంటాం. ముమ్మాటలా ఆడదే! వద్దన్నప్పుడు కవ్విస్తుంది. దరిచేరమన్నప్పుడు మొహమైనా చూడదు. పెద్దగా ప్రయాస కూడా పడకుండ తన పంతాన్ని నెగ్గించేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్య (ఆడ) లక్షణం, సవతి పోరు అసలు ఒప్పదు. వేరొకరిని వలచామో..

ఓ నిద్రా! నీవు నన్ను వీడి వెళ్ళిన దగ్గర్నుండి నా మనసు మనసులో లేదు. నా మనసు మనసులో లేనందు వల్లనే నీవు నన్ను వీడిపోయావని నీవు వాదించవచ్చు. తప్పు నా వైపునున్నా సరే, నీవు లేకుండా, ప్రతి రాత్రి నీతో పేచీల్లేకుండా ఉండగలనేమో గాని, కాన్ఫరెన్స్ కాల్‍లో బాస్‍గాడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు కూడా నువ్వు నన్ను కనికరించకపోతే.. జాలిగా చూస్తున్నారు జనం నన్ను. ప్లీజ్.. నా ఇమేజ్, నా గ్లామర్ దారుణంగా దెబ్బతింటున్నాయి. అసలు విషయం చెప్పటం మరిచా, మొన్నటి రైలు ప్రయాణంలో చూసిన పిల్లను దాదాపుగా మర్చిపోయినట్టే. ఇంకేం ఆలోచనలూ పెట్టుకోను. నీకే లోటూ రానివ్వను. వచ్చేయ్..

నా నిద్ర ఆచూకీ తెలిపినవారికి, మున్ముందు జన్మల్లో నిద్ర మీతో కుంభకర్ణుణితో ఉన్నంత సఖ్యంగా, గాఢంగా ఉండగలదు.*

(*అది తధాస్తు దేవతల మూడ్‍ మీద ఆధారపడుంది.**

* తధాస్తు దేవతల మూడ్ వారి వారి అప్రైసల్స్ మీద ఆధారపడగలదు. ***

***వారి వారి అప్తైజల్స్ వారి పనితనం మీద ఆధారపడదు.)