మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

మనసా..తోడుకోసం ఎదురు చూస్తున్నావా??
తోడుగా నిలవాలంటే.. నమ్మకం కుదరాలి
నమ్మకం కుదరాలంటే.. ప్రేమ వికసించాలి
ప్రేమ వికసించాలంటే.. చనువు ఏర్పడాలి
చనువు ఏర్పడాలంటే.. సఖ్యత పొందాలి
సఖ్యత పొందాలంటే.. పరిచయం కావాలి
పరిచయం కావాలంటే.. ఆకర్షింపగలగాలి
అందం లేని చోట ఆకర్షణ లేదు..
నీ అందం వరకూ చేరాలంటే నా అందం తొలి మెట్టు!!
పిచ్చి మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

Advertisements

10 comments on “మనసా.. ఇంకా తోడుకోసం ఎదురు చూస్తున్నావా??

 1. ఒక అమ్మాయిని మనసుని, తపనని ఎంత అందంగా రాసారండి..!

 2. అవరోహణ క్రమంలో ప్రేమ పుట్టుకని చెప్పి నిజాన్ని ఆవిష్కరించారు. ఇన్ని కండిషన్స్ మధ్య పుట్టే ప్రేమల్ని విలువల అద్దాల మధ్య పెట్టి ప్రజలెందుకు పహారా కాస్తున్నారో కదా!?!

  నేను నా బ్లాగులో (www.parnashaala.blogspot.com) మీ రెఫరెన్స్ ఇస్తూ మీ కవితని ఉపయోగించుకోవచ్చా?

 3. శ్రీ విద్య:
  థాంక్స్ అండి 🙂

  మహేశ్:
  నిరభ్యతరంగా నా కవితను ఉపయోగించుకోవచ్చు. నా కవిత మీద యుద్ధం ప్రకటిస్తే.. మీదే బాధ్యత మరి!! 😉

  పవన్:
  థాంక్స్!!

 4. @పూర్ణిమ

  మీ ఆలోచనల్లో చాలా స్పష్టత ఉంది. సాధారణంగా నాకు అలా అనిపించినా నాకు తెలిసిన కొన్ని పరిచయాలని గమనిస్తే అందమైన ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అసలు ఎలా ప్రేమించిందో అర్ధం కాదు. అలానే అందమైన ఓ అబ్బాయి ఓ అమ్మాయిని కూడా. మనసు నమ్మలేనిదాన్ని మెదడు పరిహసిస్తుంది. అందుకని మనసు తనకి అరుదుగా దొరికే అవకాశాలని వదులుకోదు. ఇంకా తీవ్రంగా పరిహసిస్తుంది. ఆ సంధర్భంలో నుండీ ధైర్యాన్ని, ఆశని పెంపొందించుకుంటుంది.

  అనుభవించి, శోధించి, సాధించి ఒక సత్యాన్ని కనుగొంటుంది. ఆ సత్యం ప్రేమకి వ్యతిరేకం కాదు. ప్రేమ మీద మరింత నమ్మకాన్ని పెంచేది. ప్రేమని ద్విగుణీకృతం చేసేది. ప్రేమ యొక్క అసలు తత్వాన్ని బయటపెట్టేది. మనిషిని స్వయం ప్రకాశం వైపు నడిపించేది. తనని ఒక గొప్ప ప్రేమికురాలి(ప్రియుడి)గా చేసేది. అది తెలుసుకోగానే మనసు ప్రేమ కోసం పరితపించడం మానేస్తుంది. కానీ ఆ స్థితిలో ఇంకా తోడు కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆ తోడు నుండి ప్రేమని ఆశించడానికి కాదు, పొందడానికి కాదు. ఆ తోడుకి ప్రేమని పంచడానికి!

 5. ఎలా స్పందించాలో అర్ధం కావటం లేదు. నా ధ్యాసంతా ఊహలన్ని ఊసులు చేయడములోనే ఉంది.. మీ విశ్లేషణల బట్టి వాటిలోని అందాన్ని ఆశ్వాదిస్తున్నానేమో.

  “థాంక్స్” అన్న పదం చిన్నదై పోతుందేమో కదా!! 😉

 6. మీ ఈ కవిత మీ భావనో, ఇతరుల బాధకు స్ఫందనో తెలీదు కాని అలా బాధ పడే ప్రతీ వారికీ……..

  “జాగ్రత్త మిత్రమా”

  చెత్తకుండిలో మనసు
  అబ్బాయిల బెరుకు
  సంసారపు సొగసు
  దానిలో ఒడిదుడుకు

  తెలిసిన వో మనసూ
  “అందం చూసే వాళ్ల కళ్ళల్లోనే”
  మరిచావే ఈ మాటను
  చిన్నబుచ్చకు నిరీక్షణను

  అభిరుచులు కలిసిన తొడు
  బంగారానికి తావి అద్దేను
  అది లేని జత కూడేవా
  పిచ్చొని చేతిలో మొగలి పువ్వేనూ

  సామాజికతకు, అధైర్యానికీ,
  నిరాశకూ నిస్పృహకీ
  తల ఒగ్గి సర్దుకుపోయావా
  జీవితమంతా అంతేనూ

  మన కనకపు విలువను
  కొలిచే కంసాలి తప్పక ఉండేను
  కావలసినదంతా తన కొరకు
  వేచి చూసే గుండేనూ

  కాదని సర్దుకు పోయావా
  జీవితాంతం ఇక అంతేను
  విసుగు చెంది ఆపావో
  “సగటు మనువు”లో పడ్డట్టే

  స్ఫందించే మనసూ
  అది పొందే భావుకత
  ఇవన్నిటికీ “సగటు మనువు”
  కర్కసమైన గొడ్డలి పెట్టే

  మీకు నచ్చితే వ్యాఖ్యగా పెట్టుకోండి లేదా మీకు ఇచ్చే చిన్న సూచనగా తీసుకొని వదిలేయండి.

 7. మెట్లెక్కుతున్న అబుభూతి పొందాను. చివర మెట్టెక్కగానె మంచి సూర్యొదయం లాంటి కవిత్వ కిరణాలు హృదయాన్ని తాకాయి.
  బొల్లోజు బాబా.

 8. all r correct in ur poem
  but if ur known well to any person then ur beauty will be immaterial to decide their feelings.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s