మనసైన తన కన్నీరు…

తను నా గుండెలపై తలవాల్చుకుంది. నా షర్ట్ కున్న రెండు sleevesని పిడికిల్లలో గట్టిగా పట్టుకుంది. తన అంతర్సంఘర్షణ అంతా భరించలేక నా షర్ట్ తో పాటూ నేనూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నా చేతులు తన చూట్టూ ఉన్నాయి, నాకు దగ్గరగానే తను ఉంది.. కానీ మా ఇద్దరి మధ్యా చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. నా మాటగాని, నా స్పర్శగాని ఏదీ తనని అనునయించలేక పోతున్నాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో తనను మరింత దగ్గరకు లాక్కుని, తన తలపై నా బుగ్గ ఆన్చి తన మూగ బాధను ప్రేక్షకునిగా కాక, పాత్రధారియై అనుభవిస్తున్నాను.

ఏమయ్యిందో, తను ఎందుకింత హర్ట్ అయ్యిందో నాకేమి అర్ధం కావటంలేదు. “నాకు జలుబు చేసి కాస్త నలతగా ఉంది, ఇంటికి త్వరగా వెళ్ళిపోతున్నా.. నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి రావద్దు” అని ఫోన్ చేసింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరేసరికి అంతా నిశ్శబ్ధం. అమ్మ అప్పుడే పడుకున్నట్టు ఉంది.. నాన్న ఎవో పుస్తకాలు తిరేగుస్తున్నారు. నా అలికిడి వినగానే నిషీ బయటకు వచ్చింది. తన మొహంలో చిరునవ్వు లేదు. అసలే చిన్న కళ్ళు జలుబు చేయటం వల్ల మరీ చిన్నగా కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి, గలగలమంటూ తన గొంతు వినిపించకపోవటంతో పెరిగిన నిశ్శబ్ధాన్ని వినలేకపోయాను. భరించలేని నిశ్శబ్ధంలో మాటకూడా వినపడదేమో!!

భోజనాలవ్వగానే తను మంచం మీద పడుకుండిపోయింది. దగ్గరకు వెళ్ళి “ఏమయ్యిందిరా” అని అడిగా. సమాధానం రాలేదు.. “ఎందుకింత అప్-సెట్ట్”గా ఉన్నావు మళ్ళీ అడిగా. ఈ సారి సమాధానం వచ్చింది సన్నగా వణుకుతున్న తన శరీరం రూపంలో.. తన ఏడుస్తుందేమో. ఆ ఊహే భయపెట్టింది. తనను లేపాను, మోహాన్ని నా చేతుల్లోకి తీసుకుని, “ఏంటిది?” అని కళ్ళతో ప్రశ్నించాను. చెప్పలేననట్టుగా కళ్ళు మూసుకుంది. “నిషీ..” అన్నాను ఏడుపుకి సిద్ధమవుతున్న గొంతుతో. “మధూ” మాట్లాడలేకపోతున్నా చెప్తూంది “ఓ సాయం చేస్తావా, నాకు ఏడుపొస్తుంది, చాలా!! కాసేపు నన్ను ఏడవనిస్తావా?? కారణం అడగకు.. నిన్ను పట్టుకుని ఏడవనిస్తావా?” అని అడిగింది. నాకర్ధమయ్యేలోపే నా చేతులను తన మొహం నుండి తీసేసి, తలను నా గుండెలపై వాల్చి రెండు చేతులతో నా చొక్కాని బిగిపిడికిల పట్టి.. తనివితీరా హాయిగా ఏడుస్తుంది. తన కన్నీళ్ళు నా షర్ట్ లోకి ఇంకిపోయి, ఆరిపోయాయి కూడా!! ఊ..హూ.. షర్ట్ లోకి కాదు నా హృదయంలోకి ఇంకిపోయాయి. కానీ నా గుండెలో అవి ఆరలేదు. బరువెక్కించాయి, భయంకరంగా బరువుగా ఉంది. తన గుండె నుండి నేరుగా నా గుండెలోకి, Souls at conversation అంటే ఇదేనేమో. కారణాలు వెతకటం లేదు నా మనసు కూడా.. ఈ అద్వితీయమైన సంభాషణను ఆనందిస్తూ!!

కుక్కర్ విసిల్ వినిపించేసరికి మెలుకువ వచ్చింది. తను పక్కన లేదు. నేను నెమ్మదిగా లేచి నా మార్నింగ్ వాక్ కి సిద్ధపడ్డా!! నాన్న కూడా ఇంకా వెళ్ళలేనట్టు ఉన్నారు. ఇద్దరం కలిసి బయలుదేరబోయాము. షూ వేసుకుంటుండగా.. “ఏరా.. రాత్రి నిద్ర పోలేదా” అని అడిగారు. “అవును.. పోయాను” అంటూ నేనిచ్చిన తికమక సమాధానం ఆయనకు నిజాన్ని చెప్పేసింది. పార్క్ లో ఓ రౌండయ్యాకా, బెంచీ మీద కూర్చుంటే నాన్నే మొదలుపెట్టారు నెమ్మదిగా… “నిన్న నిషీ ఆఫీసు నుండి త్వరగా వచ్చేసింది. అత్తాకోడళ్ళిద్దరూ ఎదో సరికొత్త వంట చేద్దామని పురమాయించుకున్నారు. ఎందుకో మీ అమ్మ నిషీ మీద అరుస్తుంటే వంటగదిలోకి వెళ్ళా!! గాస్ వాసన వస్తూ, నిషీ ఏడుస్తూ కనిపించింది. రాత్రి మీరు పడుకున్నాక మీ అమ్మ చెప్పింది, పాలు పెట్టిన స్టవ్ ఆరిపోయిందని నిషీ చూసుకోలేదని. గాస్ అంతా లీక్ అయ్యింది. జలబేమో తనకి వాసన కూడా రాలేదు. మిక్సీ పెట్టబోయింది. ఇది గమనించిన మీ అమ్మకి దడ వచ్చింది..నిషీకి చెబుదామంటే.. తన చెవిలో ఐపాడ్ ఉంది. అందుకే గట్టిగా అరిచింది. నిషీకి ఏమీ అర్ధం కాలేదు, చేసిన తప్పుకే అత్త తిడుతుందని భయపడింది, ఏడ్చింది. అదీ నాన్న జరిగింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు..అత్తాకోడళ్ళది అపురూప బంధం. ఇద్దరికీ కొత్తకదా, అలవాటు పడాలి. కానీ ఈ కాలపు పిల్లలు మీరు. మీకు ఎలా అర్ధాలు అవుతాయో మీ ఇష్టం. మీ బాగోగులే మా చింత” అని ముగించారు. “ఏమీ కాదులే” అన్నట్టుగా నాన్న చేతిలో చేయి వేశాను. కానీ నా మనసు కుదుటపడలేదు. తిరిగి వస్తున్నంత సేపూ ఎలాగా ఈ సమస్యకు పరిష్కారం అని ఆలోచించాను. అమ్మా, నిషీ … ఏమి చేయాలి? నాన్న భయం నిజమవుతుందా?? అన్న ఆలోచనలతో మెదడు మొద్దుబారిపోయింది.

ఇంటికి వచ్చేసరికి, అమ్మా నిషీ ఎందుకో గట్టిగా నవ్వుతున్నారు, బయటకు వినపడేలా!!. మమల్ని చూడగానే చకచకా టిఫిన్లు వడ్డించారు. వారినలా చూడగానే ప్రాణం లేచి వచ్చింది. హమ్మయ్యా!! అనుకున్నాను. అటు తర్వాత ఆఫీసు, మీటింగూ అంటూ రోజూలానే రోజు గడిచిపోతోంది. కానీ రాతింకా కళ్ళముందే ఉంది. నిషీ ఈ మాట చెప్పకుండా ఎందుకు దాచినట్టు? నేను తనను అర్ధం చేసుకోను అనుకుందా?? అందుకే చెప్పలేదా?? తన నన్ను పూర్తిగా నమ్మటం లేదా?? ఏవో ప్రశ్నలు మనసును నిలవన్నివ్వటం లేదు. తనని అడగాలి.. కాని అడగద్దనిందిగా!! అడగనులే.. ఇలాంటివి జరగకుండా మున్ముందు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎలా?? ఆఫీసు నుండి నిషీ నేనూ ఇంటికి వస్తుండగా దారిలో చిన్న చెరువు దగ్గర ఆపమంది తను. సరే అని వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాము. వీస్తున్న గాలికి తన కురులను సర్దుకుంటూ, చున్నీని పట్టుకుంటూ, నా కళ్ళలోకి చూడకుండా “నిన్న రాత్రి నన్ను అర్ధంచేసుకున్నందుకు థాంక్స్. మధూ.. నన్నేను ఆపుకోలేకపోయాను. చాలా భయం వేసింది. అందుకే అంతలా రియాక్ట్ అయ్యా.. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా..” అని తను చెప్తుండగానే.. “ఇబ్బంది కాదు.. నరకమను.. ఏమి జరిగిందో, ఏమయ్యిందో తెలియక, నిన్ను అడగలేక, ఎవరికీ చెప్పలేక ఎంత కష్టమైయ్యిందో తెలుసా? కాసేపటికి నువ్వు నిద్రపోయావు, నీ గురించి ఆలోచిస్తూ నేనంత మధనపడ్డానో.. నన్ను నమ్ముకుని నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల నన్ను పట్టుకుని ఏడుస్తుంటే.. ఎంత భయం వేసిందో!! నువ్వు నా భార్యవి, భాధ్యతవి అన్న విషయాన్ని పక్కకు పెట్టి, నా స్నేహితురాలే బాధపడుతుంటే.. ఏం చేస్తాను అలా చేసాను. అందుకే నువ్వు అడగద్దు అన్నాక మళ్ళీ అడగలేదు. అసలు ఏమి జరిగిందో చెప్తే ఏదో ఒక పరిష్కారం చూసేవాళ్ళం కదా..” అంటున్న నన్ను ఆపడం ఈసారి తన వంతయ్యింది.

“పరిష్కారం కావాలంటే ముందు సమస్య తెలియాలి. బాధ కలిగితే సమస్య ఉందనుకుంటాము, నిజానికి ఉండకపోవచ్చు కూడా!!. అసలు సమస్య లేనప్పుడు కూడా దేనినోదాన్ని సమస్యగా చిత్రీకరించి, తోచిన పరిష్కారం ఇచ్చి సంతోషిస్తాము. అందుకే నీకు చెప్పలేదు. నేను ఏడుస్తుంటే.. నీకు కలిగే బాధను నేను అర్ధం చేసుకోగలను. కానీ “ఇది” అని నీకు చెప్పలేను. నాకు కష్టం కలిగింది, అత్తయ్య ఏదో అన్నారని కాదు, నేనంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు. ఆ పరిస్థితుల్లో మా అమ్మ ఉంటే నాన్నకి చెప్పి మళ్ళీ తిట్టేది. అది కాదు నా బాధ. చెప్పించుకునేంతవరకూ వచ్చానే అని నా మీదనాకే కోపం. ఎట్టి పరిస్థితుల్లోనూ “నీకు మీ అమ్మకావాలా? నేను కావాలా?” అన్న సమస్య ఇవ్వలేను. ఆ ఆలోచన కూడా నీకు రానివ్వకూడదనే నా తాపత్రయం. భోంచేసేటప్పుడు “జాంగిరీ కావాలా?? జిలేబీ కావాలా” అని అడగచ్చు కానీ, అన్నం కావాలా? కూర కావాలా? అని ఎవ్వరూ అడగరు. We both aren’t options for you, we are absolute necessities for your life. ఆవిడ జీవితం ఇస్తే.. నేను దాన్ని పంచుకుంటున్నాను. ఆవిడ నిన్ను తయారు చేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను. నీ వల్ల ఆవిడా, నేనూ కూడా సంపూర్ణమైయ్యాము. అందుకే నీకు కష్టం కలగకూడదనే మా వేదన. అన్ని బంధాల్లానే మాకు కొంచెం సమయం కావాలి, ఒకరినొకరం అర్ధం చేసుకోవడానికి. మధూ.. మూర్ఖంగా ప్రవర్తిస్తే క్షమించు. రాత్రి చేసిన సాయం ఎప్పటికీ మరువలేను. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను” అంటూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది.

ఓ నాలుగైదు నిమిషాలు మా మధ్య ఎలాంటి సంభాషణా లేదు. ఒకరికొకరం పూర్తిగా అర్ధమైయ్యాకా.. మధ్యనున్న మౌనం కూడా గలగలా మాట్లాడుతుంది. నిన్న రాత్రి స్కూల్లో టీచరు కొట్టిన చిన్నారిలా, ఇప్పుడు జీవితం నేర్పే టీచరులా.. సహచర్యం అంటే ఇంతే.. తనలోని ప్రతీ మనిషీ నా సొంతం. నేనామెకు సొంతం. భయంకరంగా బరువెక్కిన గుండె ఇప్పుడు దూది పింజలా ఎగురుతుంది. తనని దగ్గరకు తీసుకుని.. “అయితే.. నువ్వు “అన్నం” లాగా మాట నాకు. రోజూ ఈ అన్నమే తిని బోరుకొడుతుంది.. చైనీస్ ఫ్రైడ్ రైస్ తిననా.. నా కొత్త మానేజర్ పేరు .. హౌకున్ యాంగ్!!” అన్నాను చిలిపిగా.. నన్నొక తోపు తోసింది గట్టిగా. వెనక్కి ఒరిగిన నన్ను చూసి నవ్వుకుంటూ బైక్ దగ్గరకు పరిగెత్తింది. బైక్ మీద వెళ్తుంటే నన్ను పెనవేసుకున్న తనను చూస్తూ..
“నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచానో, తానొచ్చి తాకిందో పువ్వల్లే మారేనే..” అంటూ సఖిలో పాట చరణాన్ని నా మనసు మొదలెట్టింది.

Advertisements

39 comments on “మనసైన తన కన్నీరు…

 1. పూర్ణిమగారూ,ఇప్పటిదాకా ఇంత భావుకతనా దాచారు? హమ్మయ్య! ఇప్పటికైనా చాలు, దాన్ని వండి వార్చారు. చాలా కమ్మగా ఉంది, మనసు చెమ్మగిల్లింది.

  ప్రేమకథ గా మొదలై, కన్నీటి సొదలై,కుటుంబ గాధై,తల్లా? పెళ్ళామా? అని ప్రశ్నించుకునే యువతకు నిలువెత్తు జవాబై..సఖిగా ముగించారు.ప్రియ సఖిగా మిగిలారు.

  ఇంతకంటే ఎలా చెప్పాలి? ఎలా అభినందించాలి? పదాలు బాగా పెర్చినా, నేను చెప్పాలనుకున్నది, ఇంకా చాలా ఉందనిపిస్తోంది.అందుకేనేమో అంటారు “మనసుకు నచ్చినవన్నీ, భాషకు అందవు” అని.

 2. ఈ కథ మంచి అనుభూతిని మిగిల్చింది. అత్తా కోడళ్లు ఎలా వుంటే బాగుంటుందో, అలాంటి కొరుకునే, సాన్నిహిత్యం అత్తా కొడళ్ల మధ్య కలిగినందుకు,పాఠకుడికి తృప్తి కలగవచ్చు కాని చక్కటి కథ చదివానన్న feeling రాలేదు. O.Henry కథలు చదివారా? పాపినేని శివశంకర్ ‘చివరి పిచ్చుక’ ఈ మధ్యనే దీప్తిధారలో వచ్చింది. అది కూడా చూడవచ్చు.

 3. ” ఒక్కరొక్కరం పూర్తిగా అర్ధమైయ్యాకా.. మధ్యనున్న మౌనం కూడా గలగలా మాట్లాడుతుంది.”

  “నిన్న రాత్రి స్కూల్లో టీచరు కొట్టిన చిన్నారిలా, ఇప్పుడు జీవితం నేర్పే టీచరులా..”

  మీకు జోహార్లు. ఇంతకంటే ఏమీ రాయలేను…

 4. జస్ట్ బ్యూటిఫుల్ పూర్ణిమా!

  “ఆవిడ జీవితం ఇస్తే నేను దాన్ని పంచుకుంటున్నాను.. ఆవిడ నిన్ను తయారుచేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను”

  అత్తాకోడళ్ళ సంబంధాన్ని ఎంత చక్కగా చెప్పారో! ఈ సూత్రాన్ని అర్ధం చేసుకోగలిగిన కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో కదా!

 5. Awesome పూర్ణిమ గారు, రోజు కో ఆణిముత్యాన్ని ఒక్కో బాణి లో వదుల్తున్నారు కదండీ. కుటుంబం లో అనుబంధాలని, communication ని చాలా చాలా అందం గా వివరించారు.

 6. mmm పూర్ణిమ గారు,

  పైన ఎవరో చెప్పినట్టుగా చాలా భావుకత ఉంది మీ ఈ కథలో. ఆర్త్ద్రత, భావుకత, సున్నితత్వం, మంచి ఆలోచనా సరళి గల నేటి తరం అమ్మాయిల మనస్తత్వానికి మీ కథా నాయిక పాత్ర అద్దం పడుతుంది.

  చదువుతుంటే కాశినాధుని వారి సినిమాలో కథా నాయికలను చూస్తున్నట్టు అనిపించింది. భేష్. keep it up.

 7. I do not know if you know this or not-koodali.org collects and lists out all the telugu blogs, everytime a new post is posted.

  Do submit your blog to this website by clicking on the top right had corner of the website saying “kotta blogunu cherchandi”
  so that more can enjoy ur writings

 8. చాలా బావుంది పూర్ణిమా…
  భార్యా-భర్తల బంధాన్ని, అత్తా-కోడళ్ళ మధ్య సంబంధాన్ని చాలా బాగా చెప్పారు…

 9. చాలా బాగుంది. మనసుకు హత్తుకునేలా రాసారు.

  కొన్ని సందర్భాలలో మనం హర్టయ్యేందుకు కారణమవసరం లేదు. దానినలా వదిలేసి మనుసుని తేలిక పరచుకుంటే సరిపోతుంది. నిజమే…

  ఇక్కడొక విషయం.

  చాలా మటుకు కథలలో నాకు అర్థం కానిది ఏమిటంటే అందులో భాష, ప్రయోగాలు నిజ జీవితంలో ఎవరూ ఉపయోగించరని తెలిసినా అవి మనకు దగ్గరగా అనిపించడమే…

  ఉదా: “ఏరా.. రాత్రి నిద్ర పోలేదా” అనే నాన్న ప్రశ్నకి “అవును.. పోయాను” అని ఎవరూ సమాధానం చెప్పరు. (నా ఆలోచన మాత్రమే ఇది).

  కానీ ఆ సందర్భంలో ఆ వాక్యం అమిరినట్టే అనిపిస్తుంది కథ చదువుతుంటే.

  ఎందుకో మరి ?

  మీ కథలో ఆంగ్ల పదాలు, ఆంగ్లంలో రాసిన పదాలు, వాక్యాలు పంటి కింద రాయిలా కొద్దిగా కలుక్కుమంటున్నాయి. కథ ఎక్స్ప్రెషన్ లో భాగంగానే అవి వాడారు, బాగుంది కానీ అవి కూడా తెలుగులో రాయడానికి కుదురుతుందేమో వచ్చేసారి ప్రయత్నించండి.

 10. మహేశ్ గారు:
  ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చి, కాస్త విశ్త్రాంతైనా తీసుకోక రాయడం మొదలు పెట్టి.. అర్ధరాత్రి దాటే వరకూ నిద్ర పోక, పొద్దునే నిద్ర తీరని కళ్ళతో మీ కమ్మెంట్ చదువుతుంటే.. ఎంత హాయిగా ఉంటుందో నేనూ మాటల్లో చెప్పలేను. నెనూ ఎదో ఘనకార్యం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది.
  అందమైనా వ్యాఖ్యకు నెనర్లు.

  రావు గారికి:
  చక్కటి కథ అన్న ఫీలింగ్ నేనివ్వలేనని తెలుసు. నిజం చెప్పాలంటే .. ఇది నా మొదటి ప్రయత్నం కథగా ఒక విషయాన్ని చెప్పాలని. దీని మీద ఒక వ్యాసం రాయమంటే.. ఇంత కష్టం అనిపించక పోవును. అయినా ప్రయత్నించా.. This was more out of desperation than inspiration. I just wanted to talk about this issue.

  మీరు చెప్పిన వారి గురించి నేను చదవలేదు. చదివడానికి ప్రయత్నిస్తా.

  నిషీ:
  నెనర్లు 🙂

  వేణూ:
  “ఆణిముత్యం” అవునో కాదో తెలియదు.. నా ఊహలు మాత్రమే ఇవి.

  భావకుడన్ గారికి;
  ధన్యవాదాలు. కాశీనాధుల గురించి నాకు తెలియదు. మరిన్ని విషయాలు తెలుపగరలు.

  ప్రవీణ్:
  ఓప్పిగ్గా చదివి, నా చిన్ని ప్రయత్నాన్ని మెచ్చుకున్నందుకు ముందుగా నెనర్లు. “నిజ జీవితం” అంటే… మనం మామూలుగా గమనించే విషయాలు కదా. “మనం చూడని లోకంలో ఉన్నవారిని ఈ కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నరేమో” అనుకుంటే .. మీ సందేహం కొంతవరకూ తీరినట్టే ఉంటుందా??

  “రెంటికీ చెడ్డ అతిలి బోడోడు..” అన్న తెలుగు సామెత విన్నారా?? దానికి…classic example నేను. నా ఇంగ్లీష్ మీడియుం చదువు.. నన్ను ఆంగ్లానికి, తెలుగు కీ మధ్య హింది అనే దారం తో వేలాడదీస్తుంది. ఇక మీద ప్రయత్నించే ప్రయత్నం చేస్తా. Honestly, I did struggle for the dialogues. But the point is noted, Sir!! 🙂

  sujaata:
  Thanks!!
  Nishi is just too good, I guess. I can think like her, but can’t write out, like her.

 11. కే. విశ్వనాథ్ గారి గురించి మీకు తెలీదంటే నమ్మాలా? అస్సలు నమ్మను:-) ఆయన ఇంటి పేరు “కాశీనాధుని” అంతేనండి.

 12. పూర్ణిమగారూ,superb ఇప్పటిదాకా అందరూ తమకి నచ్చినవి చెప్పారు.ఫైన అందరు చెప్పిన sentences నాకు బాగా నచ్చాయి చాలా బాగా రాసారు మీరు,వాళ్ళూ.కాని నా మనసు అలా చెప్పలేక మీ మధు పాత్ర పడ్డ బాధని నా మాటల్లో మీ ప్రేరణథో రాసేసింది ఒక సారి చూడండి.

  http://srushti-myownworld.blogspot.com

 13. @ ఫూర్ణిమ

  అద్భుతం. I felt bad for not being the first audience. మీరు రాత్రి రాస్తున్నారు అని తెలిసి ఉంటే అప్పుడే చదివేసేవాణ్నేమో. 😦

  ఇంతకుముందు నిషిగంధ గారి “శ్రీ వారికి ప్రేమ లేఖ” నా స్నేహితులందరికి పరిచయం చేసా.

  ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం బోధపడింది 🙂

 14. భావకుడన్ గారు:

  అనుకున్నా విశ్వనాథ గారే అయ్యి ఉంటారని. అయినా అనుమానం తొలగించుకోటానికే అడిగా!!
  ఆడవాళ్ళను అపురూపంగా చూపించడం వారికి తెలిసినట్టు మరవెరకీ రాదేమో.

  నాని:

  ఇప్పుడే చూసాను మీ కవిత. మధూ మానసిక సంఘర్షణని మరి కాస్త రాసి ఉండాల్సింది ఎమో.. అసలు ఈ కథ అతనిదే. నేను రాయలేక పోయినా, మీరు దానిని గమనించి,అనుభవించి ఓ కవిత రూపంలో పెట్టినందుకు చాలా థాంక్స్!! ఒక మనిషిలోనైనా ఈ వేదనను పలికించగలిగితే.. ఎన్ని తప్పులున్నా, ఎంత తడబడుతున్న.. నా రాతలకీ ఓ అర్ధం ఉందని అనిపిస్తుంది.

  దిలీప్:
  ఇంకా రాలేదేంటబ్బా అనే నేనూ చూస్తున్నా. ఇవాల్టికి మీ నుండి వ్యాఖ్య రాకపొటే.. ఇక నేనే లంకె పంపిద్దాము అని డిసైడ్ అయ్య. మీరిచ్చే thesis చదివితే నా టపాకే ఒక కొత్త అందం వస్తుందని ఆశ. “అత్భుతం” అన్న ఒక్క పదంతో ముగించేసారే?? 😦

  నిషీ “ప్రేమలేఖ” మనసున్న ప్రతీ వారు చద్వాల్సిన థియరీ.అలాంటి వారిని ప్రోత్సహిస్తున్న మీరూ అభినందనీయులే.

 15. తనకి అనుభవం లేని దృశ్యంలోకి తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలోనూ, అమ్మాయి దృష్టి నుండి కాకుండా అబ్బాయి దృష్టినుండి కథ చెప్పడం .. మీలో ఒక మంచి కథారచయిత దాగి ఉన్నారని చెప్పక చెపుతున్నాయి. కొన్ని వాక్యాలు సున్నితంగా, భావుకంగా, అద్భుతంగా ఉన్నయ్యి. అభినందనలు.
  (దయచేసి వ్యాఖ్యల్లో word verification తొలిగించండి.)

  @భావకుడన్ విశ్వనాథ్ సినిమాల్లో నాయికల్ని అంత గొప్పగా చూపెట్టారని నాకెప్పుడూ అనిపించలేదు. నాకు గుర్తున్నంత వరకూ శుభలేఖ సినిమాలో సుమలత పాత్ర ఒకటే కొంచెం వ్యక్తిత్వంతో కనబడుతుంది.

 16. కొత్త గారు:

  నేను పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు రాసారీ వ్యాఖ్య. నిజమే.. నాకు అనుభవం లేదు. కానీ ఊహించుకోవటం అలవాటే. అగ్గిపుల్లా, సుబ్బు బిళ్ళా ఇలా అన్నింటికీ లేని మనసుని ఊహించుకుని స్వగతాలు రాయగలను. ఆల్రేడీ మనసున్న అబ్బాయిలు ఈ సమయం ఎలా ఆలోచిస్తారో ఊహించగలిగినా అది అక్షరాలుగా మలచడానికి శ్రమపడ్డా!!

  నాలో మంచి రచయిత ఉన్నాడో లేడో.. నాకు తెలియదు. ప్రతీ మనసులో నా మనసు ప్రతిధ్వనించినంత కాలం నేను రాసినా రాయకపోయినా పెద్ద తేడా లేదు.

  వర్డ్ వెరిఫికేషన్ తీసేసాను. గమనించగలరు. A li’l suggestion to you. For whatever reasons you may have chosen your profile name, please do sign so that I can address you rightly.(unless you are too worried about ppl knowing ur name). మరోలా భావించక మన్నిస్తారని అనుకుంటున్నా.

  కథను, అందులోని నన్ను అర్ధం చేసుకున్న మీకు కృతజ్ఞతలతో…

  బాబా గారు:
  వచ్చేశారా?? నెనర్లు.

 17. bhaavakuDan gaaru:

  My blog is in koodali.org and that’s why I’m envying you with the comments. With jalleda this is simply not possible. How did you land up in my blog, remember??

  Medha:

  Sorry I missed your comment somehow. Thanks a lot for caring to read and post a comment.

 18. అందరూ చెప్పేసారు,ఇక నాకేం మిగల్లేదు చెప్పటానికి,just simply superb and keep it up.

  కథగా మీ మొదటి ప్రయత్నం అయినా చక్కగా చెప్పారు,అందులోనూ ఒక అబ్బాయి దృష్టితో, ఇంకొకసారి అభినందనలు.

  అక్కడక్కడ కొన్ని అక్షర దోషాలు పంటి కింద రాళ్ళలా,రాసేకొద్ది తగ్గుతాయిలేండి 🙂

  “ఇక మీద ప్రయత్నించే ప్రయత్నం చేస్తా” అన్నారు కదా, చూద్దాం!

 19. మీ ఈ కథకి కామెంటు రాసి పోస్టు చేసే లోపు కరెంటు పోయింది, మళ్ళీ వచ్చి చూసేసరికి అందరూ అన్ని రకాల పొగడ్తలు పొగిడేసారు, ఇక నాకేం మిగల్ల:(.All I can say is just simply superb and keep it up.

  అక్షర దోషాల గురించి కాస్త జాగ్రత్త వహించండి.

 20. సిరిసిరిమువ్వ గారు:

  ఏదో ఆవేశంలో ప్రవీణ్ కి మాటిచ్చేసా.. మీరూ అంటుంటే తడుతుంది.. మీ డెంటిస్ట్ ల దగ్గర కమీషన్ workout అయితే.. ఈ పంటికింద రాళ్ళు భలే భలే!! ఇప్పుడు కాస్త ఆలోచించి చెప్తాలేండి 🙂

  On a serious note, that would be taken care of.. Thanks for the advice!!

 21. @ పూర్ణిమ
  ఏం చెప్పను? ఇప్పటి వరకు మీ రాతలు చూసి ఈ అమ్మాయి నాలానే ఆలోచిస్తుంది అనుకున్నాను. ఇప్పుడు నేను కోరుకునేలా కూడా ఆలోచిస్తుంది అని తెలిసి ఆశ్చర్యపోయాను.

  ఆ అద్భుతం లోనే అన్నీ ఉన్నాయి… 🙂

  ముగ్గురు మగాళ్ళ మధ్య అమ్మ ఒక్కతే నెట్టుకొస్తుంది. తనకి అమ్మాయిలంటే చాలా ఇష్టం. కోడలని కూతురులా చూసుకోవాలని కూతురు ముచ్చట్లు తనలో చూసుకోవాలని… పెద్ద కొడుకుని కాబట్టి అవన్నీ నాతో పంచుకుకోవడం ఎక్కువ. అవన్నీ చిన్న చిన్న కోరికలే. కానీ వచ్చే కోడలు కూడా ఆ ఆలోచనని అర్ధం చేసుకుంటుందా, సరిగ్గ మంచి మనసుతో రిసీవ్ చేసుకుంటుందా అని భయమేస్తుంది. నా కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నాకు కలిగే అత్యంత అభద్రతా భావమది నన్ను తొలిచేస్తుంటుంది.

  మీ రచన చదివిన తరవాత కొంచెం భద్రంగా, ధైర్యంగా అనిపించింది. ఆ మిశ్రమ భావనలో “అద్భుతం” అన్న పదం తప్ప ఇంకేమీ బయటకి రాలేదు 🙂

 22. దిలీప్:
  చనువు తీసుకుని “ఏమి?” అని అడిగిన్నందుకు మరోలా భావించక మనసు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.:-)

 23. @purnima garu,

  mee blog naaku “telugu blog” ane communitylo kanapadindi ani anukuntaanandi. nenu naalaaga bhaavukata unde blogs kosam appudappudu alaa vetukutoo untaanu– alla vachchaanu mee blog loki.

 24. ఇన్నాళ్ళూ కనపడిన ప్రతిటపాకీ కామెంటు రాసేదాన్ని.ఇప్పుడు ఎంతో నచ్చిన టపాలకి కూడా రెండు ముక్కలు రాసే సమయం దొరకట్లేదు.ఈ మధ్యకాలం లో చాలా చాలా చక్కగా రాస్తున్న వారిలో మీరొకరు.మీ ఆలోచనలుగానీ,భావాలుగానీ,అవి వ్యక్తీకరించే తీరుగానీ చాలా బాగుంటున్నాయి.మీరిలాగే పదికాలాలపాటూ మంచి మంచి టపాలురాస్తూ మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను.మీ పెళ్ళయ్యాకా కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.

 25. అంతకుముందు నేను వ్రాసిన కామెంట్ రాలేదేంటి….?! సరే మళ్ళీ వ్రాస్తాను… కధ చెప్పిన తీరు చాలా బావుంది…

 26. పూర్ణీమా,
  నీ బ్లాగులు చదవడానికే నాకు టైమంతా సరిపోతోంది తల్లీ! చాలా బాగుంది. ‘కోదల్ని కూతురు లాగా చూడాలనో, అత్తని అమ్మలాగా చూడాలనో పెద్ద మాటలు చెప్పను ! ‘ఇద్దరూ’ ‘ఇది మనిల్లు..మనం ఒక కుటుంబం(వీళ్ళిద్దరి మధ్యా ఉన్న వ్య్వక్తితో పాటుగా) అనుకుంటే…ఇదిగో ఇలాగే తేలిపోతాయి సమస్యలు(అనుకున్నవి)! నా పాత పోస్టుల్లో నీకు వీలైతే ” మా వారి అమ్మ ” చదవ గలవా ఒక సారి!( ఏకవచనంలో సంబోధిస్తున్నందుకు అభ్యంతరమైతే చెప్పు ప్లీజ్)

 27. భావకుడన్ గారు:
  మీలా భావుకత ఉందంటూ నన్నూ కలుపుకున్నందుకు ధన్యవాదాలు. మీ మనోజ అంటే నాకు భలే ఆసక్తి. 🙂

  రాధిక గారు:
  గమనిస్తున్నా!! మీరు ఈ మధ్య ఎక్కడా కనిపించకపోవటంతో బిజీ ఏమో అని తీర్మానించేసుకున్నాను. మీ అభినందనకు కృతజ్ఞతలు. పెళ్ళయ్యాక ఏమి చేస్తానో / చెయ్యనో నాకు తెలీదు. ఇప్పటికి మాత్రం ఇలా.. తోచింది తోచినట్టు రాశేస్తున్నా!!

  మేధ:
  మీ కమ్మెంట్ రాలేదని కాదు, నేను దాన్ని చాలా ఆఅస్యంగా గమనించాను. మళ్ళీ వచ్చినందుకు థాంక్స్!!

  సుజాత గారు:
  సమయాన్ని మింగేస్తున్నాను అనుకోక.. నా టపాలు చదివిపెట్టండి. ఇప్పుడిప్పుడే చిట్టి అడుగులు వేస్తున్నా.. మీరు వెనుక ఉంటే అదో ధైర్యం. అభిప్రాయాలు కలిసాకా.. ఆలోచనాసరళి ఒకేలా ఉన్నాక “మీరు” అని పిలవడం కష్టం గా ఉంటుందని నాకూ ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. నిరభ్యంతరంగా పిలవచ్చు మీరు నన్ను, మీకు తోచినట్టు!!

 28. పూర్ణిమ గారు;సున్నిత మైన విషయం, మరింత సున్నితంగా కథ గా అల్లారు. హాట్సాఫ్.

 29. అమ్మయ్య ఒక్కరైనా అది చదివారని తెలిసింది. ఎంత సంతోషంగా ఉందొ. నేను చేసిన సాహితీ ప్రక్రియలలో నాకు చాలా ప్రియమైనది నా “మనోజావిష్కరణం” . ఎవరూ వ్యాఖ్యానించక పోవటం వలన నిరుత్సాహ పడి కొంత, తీరిక దొరకక కొంత ఈ మధ్య దాన్ని ముందుకు నడపలేదు 😦 చెప్పాగా ఎంతైనా కొంచం కీర్తి కండూతి ఉన్న వాడినే.:-)

 30. జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల అని సామెత 🙂
  మితిమించిన స్వాతిశయంలో అందరూ నన్ను గుర్తు పెట్టేస్తారు అనుకుంటూ ఉంటాను.
  ఇది గూగులు వాడి వివిధ ఎకౌంట్ల మాయ. పేరు “కొత్త” అని సగమే కనబడినా, అదీ నేనే.
  మాట మన్నించి వర్డువెరిఫికేషను తొలగించినందుకు ధన్యవాదాలు
  మీ
  కొత్తపాళీ

 31. రమ్యా: నెనర్లు 🙂

  భావకుడన్ గారు: ఏమాత్రం తగద్దు.. చదవడానికి నేను సిద్ధం.. మీరు రాస్తూ పోండిక.

  కొత్తపాళీ గారు:
  abcxyz అన్న పేరున్నా పెద్దగా పట్టించుకోని నేను “కొత్త” కి అంతలా స్పందించడానికి కారణం “కొత్త పాళీ” వారు అప్పటిదాకా వ్యాఖ్యానించకపోవడం. “నాకేమీ నచ్చలేదమ్మమ్..” అని కూడా అనలేనంతగా కష్టపెట్టానా అన్న నిరాశ!! “కొత్త” తో చిగురించిన ఆశలు “పాళీ” లేకపోయే సరికి ఉండబట్టలేక.. అలా అనేశా!! అప్పటికీ ఆశ చావక మీ profile చూసా.. అక్కడ పూర్తి పేరుండడంతో ..:-((

  “నా పేరు నా ఇష్టం.. నీకేం??” అని అనుకోకుండా.. నేను నేనే అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

 32. చాలా బాగుంది కథ!
  కాకుంటే…ఒక కంప్లైంట్… కాస్త సైజు పెంచి ఉండవచ్చు. ఇంత అద్భుతంగా రాసే కథలు..మరి కాసేపు చదవాలనిపించదూ? Perhaps, u can take the story further..and mould it in to even more interesting one….

 33. థాంక్స్ సౌమ్యా!! చెప్పేయాలనుకున్న విషయం చెప్పేసే దాకా.. కంగారు పడినట్టు రాసా ఇది. ఇక ముందు చూడాలి!!

 34. We both aren’t options for you, we are absolute necessities for your life. That statement describes every thing. No comments are further required. 🙂

 35. భార్య భర్తల అనుభందం ఒక అపురూమ్పమైన అనుభవం. కొన్ని సార్లు బాధకి definition ఉండదు. అది అర్ధం చేసుకుని మసలుకునే సహ్రుదయులు తక్కువేమో!

 36. “నన్ను నమ్ముకుని నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల నన్ను పట్టుకుని ఏడుస్తుంటే.. ఎంత భయం వేసిందో!! నువ్వు నా భార్యవి, భాధ్యతవి అన్న విషయాన్ని పక్కకు పెట్టి, నా స్నేహితురాలే బాధపడుతుంటే.. ఏం చేస్తాను అలా చేసాను”

  Cant expect anything more from a life partner.

  “ఆవిడ జీవితం ఇస్తే.. నేను దాన్ని పంచుకుంటున్నాను. ఆవిడ నిన్ను తయారు చేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను. నీ వల్ల ఆవిడా, నేనూ కూడా సంపూర్ణమైయ్యాము.”

  Beautiful.

  Sorry.. I dont have any more words.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s